India Bans Export Of Wheat Flour, Maida, Semolina: దేశీయంగా పెరుగుతున్న ధరలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం గోధుమ పిండి, మైదా, సెమోలినా మరియు హోల్‌మీల్ ఆటా ఎగుమతులను నిషేధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) యూనియన్ క్యాబినెట్ నిర్ణయాన్ని నోటిఫై చేసింది. వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించాలని ఆగస్టు 25న కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో దీనిని ఆమోదించడం జరిగింది.
ఈ వస్తువులపై బ్యాన్ ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన గోధుమల ఎగుమతిదారులు రష్యా, ఉక్రెయిన్. ఈ రెండు ప్రపంచ గోధుమ వ్యాపారంలో నాలుగింట ఒక వంతు వాటా కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా గోధుమల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో భారతీయ గోధుమలకు డిమాండ్ పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో గోధుమల ధర ఒక్కసారిగా పెరిగింది.
దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మేలో గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. దీంతో గోధుమ పిండికి ఓవర్సీస్లో డిమాండ్ పెరిగింది. భారతదేశం నుండి గోధుమ పిండి ఎగుమతులు 2021 ఏప్రిల్-జూలై మధ్య కాలంలో 2021తో పోల్చితే 200 శాతం వృద్ధిని నమోదు చేశాయి. విదేశాల్లో గోధుమ పిండికి పెరిగిన డిమాండ్ దేశీయ మార్కెట్లో వస్తువుల ధరలు గణనీయంగా పెరగడానికి దారితీసింది. 2021-22లో భారతదేశం 246 మిలియన్ డాలర్ల విలువైన గోధుమ పిండిని ఎగుమతి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఎగుమతులు దాదాపు $128 మిలియన్లుగా ఉన్నాయి.
Also Read: Jayalalithaa Death Probe: సీఎం స్టాలిన్ వద్దకు చేరిన జయలలిత డెత్ రిపోర్ట్..నివేదికలో అసలేముందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook