వినాయక చవితి పర్వదినంతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎప్పటిలాగే ముంబాయిలో భారీ గణపతి విగ్రహాలను ప్రతిష్టిస్తున్న పలు సేవా మండళ్లు భారీగా ఇన్సూరెన్స్ కవరేజ్‌లు పెంచేశారు. ఈ ఏడాది కూడా భారీ గణపతిని ప్రతిష్టిస్తున్న గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్ (జీఎస్బీ) గణేష్ మండల్ ... ఏకంగా రూ.264.75 కోట్లకు ఆ విగ్రహానికి ఇన్సూరెన్స్ చేయించింది. ముంబైలోనే ఇది అత్యంత ఖరీదైన గణేష్ మండల్ కావడం విశేషం.
జీఎస్బీ గణేష్ మండల్ ప్రాంగణంలో 65 CCTV కెమెరాలని ఏర్పాటు చేసింది. ఇవి నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కి అనుసంధానించబడ్డాయి. తమ గణపతిని 70 కేజీల బంగారం, 350 కేజీల వెండితో ముస్తాబు చేశామని.. గత 64 ఏళ్లుగా భక్తులు విరాళంగా ఇస్తున్న బంగారం, వెండితో ఇది సాధ్యమైందని జిఎస్బి గణేష్ మండల్ అధికార ప్రతినిధి ఆర్.జి. భట్ తెలిపారు.
"ఈ విగ్రహం వచ్చే ఐదు రోజుల పాటు మండల్లో ఉంటుంది. ఈ మండల్ భద్రత కోసం 500 మందిని నియమించాము. అంతేకాదు.. డ్రోన్ కెమెరాలను బిగించాం. వీటి నిర్వహణ మండల్ సిబ్బంది చూసుకుంటారు" అని అన్నారు. ఈ మండల్ ఐదు రోజుల పాటు గణేష్ చతుర్థిని జరపడానికి సన్నాహాలు చేసింది.
Mumbai: #Visuals from Siddhivinayak Temple on the occasion of #GaneshaChaturthi pic.twitter.com/66rnxum88F
— ANI (@ANI) September 13, 2018
#Mumbai: Drones being used at Sion East's GSB Seva Mandal for security surveillance. The Ganesh idol here is decorated with more than 70 kg 23-carat gold. pic.twitter.com/ggAnRAhBEY
— ANI (@ANI) September 13, 2018