Munawar Faruqui: మునావర్ ఫరూఖీ ఢిల్లీ షో రద్దు.. మరీ హైదరాబాద్ లో ఎందుకు అనుమతి ఇచ్చినట్లు?

Munawar Faruqui: గత నాలుగైదు రోజులు హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. ఆందోళనలతో పాతబస్తి అట్టుడుకింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. వందలాది మంది పోలీసులు గస్తీ కాశారు. పలు ప్రాంతాల్లో అనధికార కర్ఫ్యూ విధించారు. కేంద్ర బలగాలను మోహరించారు.

Written by - Srisailam | Last Updated : Aug 27, 2022, 10:16 AM IST
Munawar Faruqui: మునావర్ ఫరూఖీ ఢిల్లీ షో రద్దు.. మరీ హైదరాబాద్ లో ఎందుకు అనుమతి ఇచ్చినట్లు?

Munawar Faruqui: గత నాలుగైదు రోజులు హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. ఆందోళనలతో పాతబస్తి అట్టుడుకింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. వందలాది మంది పోలీసులు గస్తీ కాశారు. పలు ప్రాంతాల్లో అనధికార కర్ఫ్యూ విధించారు. కేంద్ర బలగాలను మోహరించారు. బీజేపీ  ఎమ్మెల్యే గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లను ముట్టడించారు. హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. సాయంత్రానికే అతని రిమాండ్ రిపోర్టును కోర్టు కొట్టివేసింది. దీంతో మరుసటి రోజు ఏకంగా రాజాసింగ్ కు  పీడీ యాక్ట్ పెట్టారు. చంచల్ గూడ జైలుకు తరలించారు హైదరాబాద్ పోలీసులు.

హైదరాబాద్ లో శాంతిభద్రతల సమస్య తలెత్తటానికి అసలు కారణం ఏంటన్న దానిపై భిన్నవాదనలు వస్తున్నాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వీడియో విడుదల చేయడం వల్లే ఆందోళనలు నెలకొన్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజాసింగ్ కావాలనే వివాదాస్పద వీడియోను రిలీజ్ చేశారని చెబుతున్నారు. బీజేపీ వర్గాలు మాత్రం అసలు వివాదానికి కారణం స్టాండప్ కమీడియన్ మునావర్ ఫరూఖీ షోకు హైదరాబాద్ లో అనుమతి ఇవ్వడమేనని చెబుతున్నారు. తాము ఎంతగా అభ్యంతరం చెబుతున్నా కేటీఆర్ కావాలనే మునావర్ ను హైదరాబాద్ తీసుకొచ్చారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే వాదనే చేశారు. మునావర్ షోకు అనుమతి ఇస్తే.. తాను వీడియోలు విడుదల చేస్తానని ముందు చెప్పానని.. హైదరాబాద్ లో జరిగిన ఘటనలకు మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని హిందూ  సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ వివాదం సాగుతుండగానే తాజాగా మరో కీలక పరిణామం జరిగింది.   మునావర్ ఫరూఖీ కు ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. ఆగస్టు 28 న జరగాల్సిన అతని ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. కేదార్‌నాథ్ సాహ్ని ఆడిటోరియంలోని డాక్టర్ ఎస్‌పిఎం సివిక్ సెంటర్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మునావర్ ఫరూఖీ షో జరగాల్సి ఉంది. ముందుకు ఈ షోకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు.తాజాగా అనుమతి రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో  మత సామరస్యానికి విఘాతం కల్గుతుందనే ఢిల్లీ పోలీసులు మునావర్ ఫరూఖీ షోకి అనుమతి రద్దు చేశారని తెలుస్తోంది. మునావర్ షో తరువాత హైదరాబాద్ లో అదుపు తప్పిన శాంతి భద్రతల దృష్ట్యా  ఢిల్లీలో షో కు అనుమతి నిరాకరించారు పోలీసులు.

ఢిల్లీ పోలీసుల నిర్ణయంతో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ సర్కార్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ షోకు అనుమతి ఇవ్వడం వల్లే ఇటీవల ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయనే వాదన వస్తోంది. ఢిల్లీ పోలీసుల తరహాలో హైదరాబాద్ షోకు అనుమతి ఇవ్వకపోతే అసలు సమస్యే వచ్చేది కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్ ల ఆగస్టు 20న మునావర్ షో జరిగింది. హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో జరిగిన ఈవెంట్ కు భారీ భద్రత కల్పించారు సైబరాబాద్ పోలీసులు. వెయ్యి మంది హాజరైన షోకు 2 వేల మంది పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారనే విమర్శలు వచ్చాయి. రెండు వారాల క్రితం బెంగళూరులో మునావర్ షో జరగాల్సి ఉండగా.. అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు. కాని తెలంగాణ సర్కార్ మాత్రం పర్మిషన్ ఇచ్చింది. దీనిపైనే జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Read Also: Chiranjeevi: రెండు, మూడు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చిరంజీవి... కారణమిదే..  

Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత పెరిగిందంటే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News