Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్నారు. అంతేకాదు మన దేశంలోను అత్యంత శక్తివంతమైన నేతగా కొనసాగుతున్నారు. వరుసగా మూడు సార్లు ప్రధాన మంత్రి పీఠం అధిరోహించి 60 యేళ్ల రికార్డును తిరగరాసారు. అంతేకాదు కరోనా ప్రపంచ దేశాల్లో ఎంత మంది నాయకులు మారినా.. ప్రధానిగా మళ్లీ ప్రజల మన్ననలు అందుకోవడం మాములు విషయం కాదు. అంతేకాదు వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెస్ యేతర ప్రధాన మంత్రిగా రికార్డు నెలకొల్పారు.
వరుసగా రెండుసార్లు పూర్తి మెజారిటీతో గెలుపొందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మూడోసారి మాత్రం మెజారిటీ మార్కుకు 32 సీట్ల దూరంలో ఆగిపోయారు. ప్రస్తుతం మిత్ర పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. మన దేశంలో వరుసగా ఈయన అత్యంత శక్తివంతుడైన నాయకుడిగా పేరు గడించారు. ఆయన తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ జీ భాగవత్ రెండో స్థానంలో నిలిచారు. మూడో ప్లేస్ లో ప్రధాన మంత్రికి అన్ని తానై వ్యవహరించే హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. నాలుగో స్థానంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిలిచారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రుల్లో చంద్రబాబే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు తెలిపింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ గోడకు కొట్టిన బంతిలా తిరిగి రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకోవడం మాములు విషయం కాదు. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసింది. నరేంద్రమోదీ వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఎన్నికై.. 60 ఏళ్ల రికార్డు తిరగాశారు.
ఒకవైపు అమెరికాతో.. మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహసంబంధాలు కొనసాగిస్తున్న నేతగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారని విశ్లేషించింది. దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్న చంద్రబాబు.. రాష్ట్ర పరిపాలనపైనా తనదైన ముద్రచూపుతూ ముందుకెళ్తున్నారు.తర్వాతి స్థానాల్లో బిహార్ సీఎం నీతీష్‌కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఉన్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter