National Herald Corruption Case: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో పాటు ఢిల్లీలో మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఇప్పటికే సోనియాతో పాటు రాహుల్ గాంధీని విచారించింది. 2013 సంవత్సరంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ కోర్టులో పిల్ దాఖలు చేయడంతో వీరిపై కేసు నమోదు అయింది. అప్పటి నుంచి ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ. 90 రూపాయలను యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా కుట్రపూరితంగా వసూలకు పాల్పడిందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. అంతేకాదు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, మరొకందరి పేర్లను పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు అదేశాలతో ఈడీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అటు యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెట్ కంపెనీపై పలు ఆరోపణలు ఉన్నాయి. 2010 సంవత్సరంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కంపెనీకి ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడాతో పాటు తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. వీరితో గాంధీ కుటుంబం వీధేయులుగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విచారిస్తున్నారు. ఇప్పటికే వీరికి పలు ప్రశ్నలు సంధించారు. ఇటీవల కాలంలో దేశంలో ఈడీ అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్, ముంబై వంటి ప్రాంతాల్లో పలువురు రాజకీయ నేతల ఇళ్లల్లో సోదాలు చేశారు. కోట్ల రూపాయలతో పాటు విలువైన పత్రాలను సీజ్ చేశారు. దీంతో ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!
Also read:MP Fire Accident: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అగ్నికీలలు..పలువురు సజీవ దహనం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook