Medical Seats: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన నీట్, పీజీ, యూజీ ప్రవేశ పరీక్షల నేపధ్యంలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మెడికల్ సీట్ల వివరాల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయనేది వెల్లడించింది.
దేశంలో ప్రధానమైన జాతీయ అర్హత పరీక్ష అంటే నీట్(NEET 2021)త్వరలోనే జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ జరిగే మెడికల్ సీట్ల వివరాల్ని కేంద్ర ప్రభుత్వం(Central government) వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఎన్నెన్ని సీట్లున్నాయనేది ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 558 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 83 వేల 275 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఇందులో ప్రభుత్వ కళాశాలలు 289 కాగా..ప్రైవేటు కళాశాలలు 269 కళాశాలలున్నాయి. ప్రభుత్వ పరిధిలో 43 వేల 435 మెడికల్ సీట్లుంటే..ప్రైవేటులో 39 వేల 840 సీట్లున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం అంటే 6 వేల 515 సీట్లను నేషనల్ పూల్(National Pool)కు కేటాయిస్తారు. అంటే ఈ సీట్లను జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు లభించినవారికి లభిస్తాయి. జాతీయస్థాయిలో రెండుసార్లు కౌన్సిలింగ్ అనంతరం నేషనల్ పూల్‌లో మిగిలిన సీట్లను తిరిగి సంబంధిత రాష్ట్రాలకు ఇచ్చేస్తారు. తెలంగాణలో ఉన్న 34 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 5 వేల 240 ఎంబీబీఎస్(MBBS Seats Availability)సీట్లున్నాయి.ఇందులో 11 ప్రభుత్వ కాలేజీలు కాగా..23 ప్రైవేటు కాలేజీలున్నాయి. ప్రైవేటు కళాశాలల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేయనుంది. 35 శాతం సీట్లను బి కేటగరీలో నిర్ణీత ఫీజుతో భర్తీ చేస్తారు. ఇక 15 శాతం సీట్లను ఎన్ఆర్ కోటాలో యాజమాన్యం భర్తీ చేసుకుంటుంది.
Also read: India Corona Udpate: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ ఉధృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook