Nitish Kumar Demands Special Status: ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది. నితీశ్ కుమార్ పార్టీలో తీర్మానం చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది.
AP Congress Party: ప్రత్యేక హోదా అంటూ 10 ఏళ్లుగా ఆంధ్రులను గొర్రెలను చేశారంటూ వైఎస్సార్పీపీపై షర్మిలా మండిపడ్డారు. మొదటి 5 ఏళ్లు చంద్రబాబు మనలను గొర్రెలను చేశాడు. ఆ తర్వాత జగన్ మరో 5 ఏళ్లు గొర్రెలను చేశాడంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిలా ఎద్దెవా చేశారు.
అవిశ్వాసంపై చర్చ జరపకుండా సభను వాయిదా వేయడంతో పార్లమెంటు ఆవరణలో తెదేపా ఎంపీలు ధర్నాకు దిగారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా కేంద్రం కుట్ర పన్నిందని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన సభ్యులను నియత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ .. ఆందోళన మధ్యే బడ్జెట్ ను ఆమోదించుకున్న కేంద్రం.. అవిశ్వాస తీర్మానంపై చర్చ ఎందుకు చేపట్టలేకపోతోందని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోడీ సర్కార్ కావాలనే అవిశ్వాస తీర్మానానికి అడ్డంకులు సృష్టిస్తోందని జేసీ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని.. అయితే ప్రత్యేకహోదాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని సంసద్ రోడ్డులో చేపట్టిన 'ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష' శిబిరానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.