Aryan Khan: షారుక్‌ తనయుడికి బెయిల్‌ నిరాకరణ.. మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు..

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరించింది ముంబాయి కోర్టు. వివరాల్లోకి వెళితే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2021, 07:35 PM IST
  • ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరణ
  • మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు
  • డ్రగ్స్ కేసులో నిన్న ఎనిమిది మంది అరెస్ట్
Aryan Khan: షారుక్‌ తనయుడికి బెయిల్‌ నిరాకరణ.. మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు..

Aryan Khan: డ్రగ్స్‌ కేసు(Drugs Case)లో అరెస్టయిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు ముంబయి కోర్టు(Mumbai court) నిరాకరించింది. అతడితో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ దమేచాలను ముంబయి సిటీ కోర్టు ఈ నెల 7వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది. క్రూజ్‌లో జరిగిన రేవ్‌ పార్టీ(Mumbai Rave Party Case)లో డ్రగ్స్‌ వినియోగం, విక్రయం వ్యవహారంలో ఆర్యన్‌ఖాన్‌ సహా మొత్తం ఎనిమిది మందిని నిన్న(అక్టోబరు3) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిలో ఈ ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టారు. 

మరింత సమాచారం రాబట్టేందుకు ఆర్యన్‌ ఖాన్‌(Aryan Khan)తో పాటు నిందితులను ఈ నెల 11వరకు కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ(NCB) కోరింది. ఎన్సీబీ తరఫున కోర్టులో ఏఎస్‌జీ అనిల్‌ సింగ్‌ వాదనలు వినిపించగా.. ఆర్యన్‌ తరఫున సతీశ్‌ మనేశిందే వాదించారు. వీరిద్దరి మధ్య వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. డ్రగ్స్‌ వాడిన వారిని దర్యాప్తు చేయకపోతే ఎవరు సరఫరా చేస్తున్నారో, ఫైనాన్సింగ్ ఎవరు చేస్తున్నారో ఎలా తెలుసుకోగలమని ఎన్సీబీ తరఫు న్యాయవాది అన్నారు. అన్ని ఆధారాలు ఉన్నందున నిందితులను అరెస్టు చేసినట్టు కోర్టుకు తెలిపారు. డ్రగ్స్‌ కుట్ర ఛేదించాలంటే నిందితుల కస్టడీ అవసరమని వాదించారు.

Also Read: Aryan Khan Arrest: 'నా కొడుకు ఏదైనా చేయొచ్చు'.. షారుక్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియో వైరల్

అయితే, ఎవరెవరి నుంచి ఎంత మోతాదులో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారని కోర్టు ప్రశ్నించగా.. అర్బాజ్‌ మర్చంట్‌ నుంచి 6గ్రాములు, మూన్‌మూన్‌ దమేచా నుంచి 5గ్రాములు చొప్పున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ తెలిపినట్టు సమాచారం. ఆర్యన్‌ ఫోన్లో, వాట్సాప్‌ చాట్స్‌లో డ్రగ్స్‌కు సంబంధించి కీలక సమాచారం లభించిందని, ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు కూడా బయటపడినట్టు ఎన్సీబీ(NCB) అధికారులు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News