Noida Twin Towers Case: 'ఒక్క టవర్‌నే కూల్చండి'..సుప్రీంను వేడుకున్న బిల్డర్

Noida Twin Towers Case: నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కేసులో సూపర్ టెక్ కంపెనీ దారికొచ్చింది. తీర్పును సవరించాలని కోరుతూ..బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్విన్‌ టవర్లలో ఒక్కదాన్నే కూల్చేస్తామని, అందుకు న్యాయస్థానం అంగీకరించాలని అభ్యర్థించింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2021, 04:14 PM IST
  • ట్విన్‌ టవర్స్‌ కేసులో వెనక్కి తగ్గిన సూపర్ టెక్ కంపెనీ
  • ఒక్క టవరే కూల్చాలని వేడుకోలు
  • సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు
Noida Twin Towers Case: 'ఒక్క టవర్‌నే కూల్చండి'..సుప్రీంను వేడుకున్న బిల్డర్

Noida Twin Towers Case: నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కేసు(Twin-Tower Case)లో బిల్డర్ వెనక్కి తగ్గాడు. ఇంతకాలం నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టామంటూ చెబుతూ వచ్చినవారు తప్పును ఒప్పుకున్నారు. భారీ శిక్ష నుంచి మినహాయించాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు.

వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్‌(UP) రాష్ట్ర పరిధిలోని నోయిడా(Noida)లో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ భారీ ప్రాజెక్టు కింద నిబంధనలకు విరుద్ధంగా  40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం చేపట్టింది. దీనిపై అలహాబాద్‌ హైకోర్టు(Allahabad High Court)లో పిటీషన్‌ దాఖలు చేయగా.. విచారించిన కోర్టు జంట భవనాలను కూల్చి వేయాలంటూ తీర్పు ఇచ్చింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సూపర్‌ టెక్‌(Supertech) సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసు వివరాలను పూర్తిగా విచారించిన సుప్రీం కోర్టు(Supreme Court) అలహాబాద్‌ హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ జంట భవనాలను రెండు నెలల్లోగా నేలమట్టం చేయాలంటూ తీర్పు చెప్పింది. అంతేగాక, ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుక్కొన్న వారికి బుక్‌ చేసుకున్న సమయం నుంచి 12 శాతం వడ్డీతో ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని కోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పుపై సూపర్‌ టెక్‌ సంస్థ రివ్యూ పిటీషన్‌ వేసింది. 

Also Read: Online Gold: కేవలం రూ.100 కే బంగారం.. ఎగబడుతున్న జనం

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తీర్పు వ్యతిరేకంగా రావడంతో సూపర్‌టెక్‌ సంస్థ దారికొచ్చింది. ట్విన్‌ టవర్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఒక్క భవనాన్ని కూల్చివేసేలా తీర్పును మార్చాలంటూ వేడుకుంది. ఈ అవకాశం ఇస్తే మిగిలిన ఒక్క భవనాన్ని పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తామంటూ బతిమాలింది. భవన నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని, ఎంతో సిమెంటు, స్టీలు వినియోగించామని అదంతా వృథా అవుతుందని పేర్కొంది. రెండు భవనాలను కూల్చేస్తే శిథిలాలతో ఆ ప్రాంతం నిండిపోతుందని పేర్కొంది. మొత్తంగా చేసిన తప్పును ఒప్పుకుని శిక్షలో మినహాయింపు ఇవ్వాలని వేడుకుంది. ఈ టవర్లలో మొత్తం 915 అపార్ట్‌మెంట్లు, 21 షాపులు ఉన్నాయి. ఇందులో 633 అపార్ట్‌మెంట్లు ఇప్పటికే బుక్‌ అయ్యాయి. అయితే గ్రీన్‌ జోన్‌ పరిధిలో ఈ భవన నిర్మాణం చేపట్టడంతో వివాదం రాజుకుంది. 

ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(Residents Welfare Association)కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. రెండు టవర్స్‌ మధ్య కనీస దూరం పాటించడం లేదని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ లేఖ రాసినా నోయిడా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఈ టవర్స్‌ నిర్మాణంపై రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏళ్ల పాటు న్యాయపోరాటం చేయగా.. భవనాలను కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News