పోలవరాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి ఒడిషా సర్కార్ లేఖ !

        

Last Updated : Jun 2, 2018, 03:55 PM IST
పోలవరాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి ఒడిషా సర్కార్ లేఖ !

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టకు ఒడిషా సర్కార్ అడ్డుతగులుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు తక్షణమే నిలుపుదల కేంద్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ముంపు, పునరావాసం తేలేవరకు పనులను కొనసాగించవద్దని లేఖలో కోరారు. కాగా ఇన్నాళ్లు అభ్యంతరాలు చెప్పని ఒడిశా నుంచి ఒక్కసారిగా అభ్యంతరాలు రావడం గమనార్హం. కేంద్రం పెద్దలే కావాలని పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

ప్రాజెక్టను ఆపే ప్రసక్తే లేదు 
పోలవరం ఏపీకి జీవనాడి లాంటిదని..ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పనుల నిలుపుదల చేసే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు వెళ్తామన్నారు. ప్రస్తుతం 50  శాతానికిపైగా పోలవరం పనులు పూర్తయ్యాయని..2019 ఎన్నికల్లోపూ పోలవరం పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Trending News