'లాక్ డౌన్'కు మద్దతిస్తాం..!!

'కరోనా వైరస్' మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏప్రిల్  15 వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ  కూడా తమ మద్దతు  ప్రకటించింది.

Updated: Mar 26, 2020, 01:10 PM IST
'లాక్ డౌన్'కు మద్దతిస్తాం..!!

'కరోనా వైరస్' మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏప్రిల్  15 వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ  కూడా తమ మద్దతు  ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి  సోనియా గాంధీ.. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ  రాశారు.  దేశవ్యాప్తంగా అమలు  చేస్తున్న లాక్  డౌన్ కు కాంగ్రెస్  పార్టీ  మద్దతు ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 21  వేల  మంది ప్రాణాలు  బలిగొన్న మహమ్మారి  పీచమణచాల్సిన అవసరం ఉందని  అభిప్రాయపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు  అండగా నిలుస్తుందని సోనియా గాంధీ  తన లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. 'కరోనా వైరస్' సోకిన వారికి సేవలు  చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి కూడా తగిన వసతులు కల్పించాలని కోరారు.  

'కరోనా వైరస్'పై పోరాటానికి పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల విరాళం

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అంశాలవారీగా ప్రజలకు రిలీఫ్  ప్యాకేజీలు అందించాల్సి ఉందని సోనియా గాంధీ తెలిపారు. ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు.  వడ్డీ రేట్లు మాఫీ చేయాలని సూచించారు. రుణాలు తీసుకున్నవారి నుంచి మరో ఆరు నెలల వరకు నెల వాయిదాలను(ఇన్ స్టాల్మెంట్స్) వాయిదా వేయాలని కోరారు. 
 
మరోవైపు 'కరోనా వైరస్' బారి నుంచి పేద ప్రజలను రక్షించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్  గాంధీ డిమాండ్  చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..