Centre to rethink on resuming international flights: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతించే విషయంపై కేంద్రం పునరాలోచనలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు (Omicron variant ) వెంటాడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై సమీక్ష నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
ముక్యంగా భారత్‌కు వచ్చే ప్రయాణికుల స్టార్డర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని కూడా సమీక్షించనుంది కేంద్రం. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
డిసెంబర్ 15 నుంచి అనుమతించాలని నిర్ణయం కానీ..
చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బ్రిటన్, సింగపూర్, న్యూజిలాండ్, హాంకాంగ్, జింబాబ్వే, మారిషస్,బోట్స్వానా, ఇజ్రాయెల్ సహా 14 దేశాలకు మినహా.. మిగతా దేశాల నుంచి వచ్చే ప్రాయాణికులను దేశంలోకి అనుమతించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
కొత్త వేరియంట్‌కు ప్రధాన కేంద్రమైన దక్షిణాఫ్రికాకు (India tranve Ban on South Africa) మాత్రం విమాన సేవలు పూర్తిగా నిలిపివేసే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.
అయితే తాజాగా.. పరిస్థితులు వేగంగా మారతున్నందున ఈ విషయంపై కేంద్రం మరోసారి ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండం, ఇప్పటికే ఆఫ్రీకాయేతర దేశాల్లో ఈ కేసులు బయటపడటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
ఆంక్షల దిశగా మరిన్న దేశాలు..
అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాలని భావిస్తున్న దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాదు.. మరిన్న దేశాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ 14 రోజులు అంతర్జాతీయ విమానాలను నిలిపివేసే యోచనలో ఉంది. మరిన్ని దేశాలు కూడా ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
Also read: Nitish Kumar: సీఎం నితీశ్ గంజాయి సేవిస్తారు-ఆర్జేడీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Also read: Drones : మన డ్రోనులు మందులకు.. పాక్ డ్రోన్‌లు వాటికోసం : కేంద్ర మంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook