కేజ్రీవాల్ పై స్మృతి ఇరానీ కౌంటర్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శనివారం ట్వీట్ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. స్మృతి ఇరానీ తన ట్విట్టర్ లో పేర్కొంటూ.. ఢిల్లీ మహిళలు ఎంతో చైతన్య వంతులని, ఎవరికి ఓటు వేయాలో తమను తాము నిర్ణయించుకునేంత సామర్థ్యం ఉన్న మహిళలలని ఆమె అన్నారు.   

Last Updated : Feb 8, 2020, 02:01 PM IST
కేజ్రీవాల్ పై స్మృతి ఇరానీ కౌంటర్

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శనివారం ట్వీట్ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. స్మృతి ఇరానీ తన ట్విట్టర్ లో పేర్కొంటూ.. ఢిల్లీ మహిళలు ఎంతో చైతన్య వంతులని, ఎవరికి ఓటు వేయాలో తమను తాము నిర్ణయించుకునేంత సామర్థ్యం ఉన్న మహిళలలని ఆమె అన్నారు.   

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తరవాత మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఖచ్చితంగా వెళ్లి ఓటు వేయండని, మీ ఇంటి బాధ్యతను స్వీకరించండని కోరారు. 

బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ మాట్లాడుతూ  బీజేపీ 50కి పైగా సీట్లను గెలుచుకుంటుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్న ప్రజలతో ఢిల్లీలో తాము సర్కార్ ఏర్పాటు చేస్తామని అన్నారు. తన పుట్టినరోజు కోసం ఫిబ్రవరి 1న వారణాసిలోని వారి గ్రామం నుండి వచ్చిన తన తల్లి ఉపవాసంలో ఉందని, నేడు ఓటు వేసిన తర్వాత మాత్రమే బయలుదేరతానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన చెప్పారు

దేశ రాజధాని ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, 12 గంటల వరకు 15.59% ఓటింగ్ నమోదైందని ఆల్ ఇండియా రేడియో వర్గాలు తెలిపాయి. ప్రధాన పార్టీల, ప్రముఖ నాయకులు ఓటింగ్ లో పాల్గొన్నారు. 

గతంలో 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 67 స్థానాల్లో విజయం సాధించి  దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.బీజేపీ మూడింటి మాత్రమే నెగ్గగా, కాంగ్రెస్ సున్నాకు పడిపోయింది. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News