దేశవ్యాప్తంగా Lockdown విధిస్తారా ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman

ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ (Lockdown in Delhi) విధించడం, దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ (Lockdown in India) విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు దేశ పౌరులను వేధిస్తున్నాయి.

Last Updated : Apr 19, 2021, 04:31 PM IST
  • ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ (Lockdown in Delhi) విధించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
  • 19వ తేదీ రాత్రి 10 గంటల నుండి 26న ఉదయం 5 గంటల వరకు ఢిల్లీలో లాక్‌డౌన్.
  • దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోనూ లాక్‌డౌన్ విధిస్తారా అనే సందేహాలు
దేశవ్యాప్తంగా Lockdown విధిస్తారా ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman

ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ (Lockdown in Delhi) విధించడం, దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు దేశ పౌరులను వేధిస్తున్నాయి. 

ప్రస్తుత పరిస్థితులకు తోడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే (Nationwide lockdown) అవకాశాలు లేకపోలేదంటూ సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఎవరి అభిప్రాయం వాళ్లు వెల్లడిస్తుండటం సాధారణ పౌరులను ఇంకొంత అయోమయానికి గురిచేస్తోంది.

FM Nirmala Sitharaman statement on nationwide lockdown in India and how to curb COVID-19 spread

ఈ నేపథ్యంలోనే దేశంలో లాక్‌డౌన్ (Lockdown in India) విధించే అవకాశాలు ఉన్నాయా అనే సందేహాలు, వదంతులకు చెక్ పెడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) ఓ కీలక ప్రకటన చేశారు. 

FM Nirmala Sitharaman statement on nationwide lockdown in India and how to curb COVID-19 spread

Also read : Lockdown in Delhi: ఢిల్లీలో లాక్‌డౌన్ విధించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) విధించే ఆలోచనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన ద్వారా స్పష్టంచేశారు. అయితే, కరోనావైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు చిన్న చిన్న మైక్రో కంటైన్మెంట్ జోన్లు (small containment zones) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

FM Nirmala Sitharaman statement on nationwide lockdown in India and how to curb COVID-19 spread

ఎక్కడెక్కడైతే కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases in India) వెలుగుచూస్తున్నాయో, అక్కడక్కడ ఈ మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడి పౌరుల కదలికలను కట్టిడి చేయడం ద్వారా కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించవచ్చనేది కేంద్రం ఆలోచన.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News