న్యూ ఢిల్లీ: పాన్ కార్డును ఇంకా ఆధార్ కార్డుతో జత చేసుకోని వారు ఎవరైనా ఉంటే... వారికి 31 మార్చి తర్వాత తిప్పేలా లేవు. అవును, పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిందిగా ఇదివరకే సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇప్పటికే పలుసార్లు పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించిన సీబీడీటీ.. చివరిసారిగా మార్చి 31, 2020ని ఆఖరి గడువుగా నిర్ణయించింది. మార్చి 31వ తేదీలోగా ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసుకోనట్టయితే.. వారికి రెండు విధాలు నష్టం తప్పదని సీబీడీటి హెచ్చరించింది. అందులో ఒకటి ఆధార్ కార్డుతో లింక్ చేయని పాన్ కార్డును రద్దు చేయడం కాగా... అలా రద్దు చేసిన పాన్ కార్డుని ఉపయోగించిన వారికి రూ.10,000 జరిమానా తప్పదని సీబీడీటీ తేల్చిచెప్పింది. ఇక ఇదే చివరి గడువని.. మార్చి 31 కంటే ఎక్కువ గడువును పొడిగించే ఉద్దేశమే లేదని సీబీడీటి స్పష్టంచేసింది.
Read also: Buying TV, fridge, AC : టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ కొంటున్నారా ? అయితే ఇది చదవండి !
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే ?..
మార్చి 31వ తేదీలోగా ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయని వారి పాన్ కార్డు రద్దు చేయనున్నట్టు సీబీడీటి ఇప్పటికే స్పష్టంచేసింది. అయితే, అలా రద్దు అయిన పాన్ కార్డ్ తిరిగి యాక్టివ్ అయ్యేవరకు సదరు పాన్ కార్డును వినియోగించాల్సి వస్తే అప్పుడు రూ.10,000 జరిమానా తప్పదు.
Read also: TikTok app users : టిక్‌టాక్ యాప్ యూజర్స్‌కి షాకింగ్ న్యూస్
ఎవరికి ఎక్కువ సమస్య ?..
ఆదాయ పన్ను చెల్లించే వారికి, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసుకునే వారికి ( Income tax returns filing ) పాన్ కార్డు తప్పనిసరి. అయితే, ఒకవేళ వారు కానీ ఆధార్‌తో పాన్ లింక్ చేయనట్టయితే... ఆ పాన్ కార్ రద్దు అవుతుంది కనుక వారికి ఆదాయ పన్ను చెల్లించే సమయంలో కానీ లేదా ఐటి రిటర్న్స్ దాఖలు చేసుకునే సమయంలో ఇబ్బందులు తప్పవు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..