స్కూళ్లు ఓపెన్ చెయ్యొద్దు.. 24 గంటల్లో 2 లక్షల పిటిషన్లు.. తల్లిదండ్రుల ఆవేదన..

 దేశవ్యాప్తంగా లాక్డౌన్ 4.0 ముగిసిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు ఎత్తివేయాలని యోచిస్తున్న తరుణంలో కొన్ని వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దశలవారీగా పాఠశాలలు,

Last Updated : Jun 2, 2020, 05:19 PM IST
స్కూళ్లు ఓపెన్ చెయ్యొద్దు.. 24 గంటల్లో 2 లక్షల పిటిషన్లు.. తల్లిదండ్రుల ఆవేదన..

హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్డౌన్ 4.0 ముగిసిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు ఎత్తివేయాలని యోచిస్తున్న తరుణంలో కొన్ని వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దశలవారీగా పాఠశాలలు, కళాశాలలపై ఆంక్షలు ఎత్తివేయాలని జూన్ 30 వరకు లాక్ డౌన్ (Lockdown 5.0) కొనసాగుతుందని, తాజాగా  విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం తల్లిదండ్రులతో సహా అన్ని వర్గాల ఏకాభిప్రాయం పొందిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. (Schools&Colleges) పాఠశాలలను తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో దీనికి వ్యతిరేకంగా 24 గంటల్లో 2 లక్షల పిటిషన్లు దరఖాస్తు చేయబడ్డాయి. 

Also Read: Tamilnadu: తెరుచుకోనున్న సెలూన్లు.. ఆ కార్డు తప్పనిసరి..

online petition on change.org title - No Vaccine, no school అనే పేరుతో తల్లిదండ్రుల సంఘం (Online petition) ఆన్‌లైన్ పిటిషన్ ను ప్రారంభించారు. కాగా ప్రస్తుతం (Vaccine)  వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో పాఠశాలల రీ ఓపెనింగ్ పై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గిన తరవాతనే చేయాలని, లేదంటే వ్యాధికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే వరకు పాఠశాలలు తెరవరాదని పిటిషన్లో పేర్కొన్నారు. 

Also Read: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సుమారు 2.13 లక్షల మంది తల్లిదండ్రులు సంతకం చేసిన పిటిషన్‌లో COVID19 మహమ్మారి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడాలని కోరుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించడానికి ఇష్టపడడం లేదని ఓ విద్యార్థి పేరెంట్స్ పేర్కొన్నారు. ప్రస్తుత అకాడెమిక్ సెషన్ (e-learning mode, virtual learning) ఇ-లెర్నింగ్ మోడ్‌లో కొనసాగాలని, వర్చువల్ లెర్నింగ్ ద్వారా పాఠశాలలు బోధనలను అమలు చేయాలని అన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News