దేశాన్ని దోచుకున్నోళ్లంతా మోదీని చూసి భయపడుతూనే ఉంటారు : ప్రధాని నరేంద్ర మోదీ

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదం తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధన్యావాద తీర్మానంపై చర్చను ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై దాడికి వేదికగా మలుచుకున్నారు. మోదీ ప్రసంగంలో నుంచి కొన్ని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

Last Updated : Feb 8, 2019, 03:17 PM IST
దేశాన్ని దోచుకున్నోళ్లంతా మోదీని చూసి భయపడుతూనే ఉంటారు : ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదం తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధన్యావాద తీర్మానంపై చర్చను ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై దాడికి వేదికగా మలుచుకున్నారు. మోదీ ప్రసంగంలో నుంచి కొన్ని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

దేశాన్ని దోచుకున్న వాళ్లంతా ప్రధాని నరేంద్ర మోదీని చూస్తూ భయపడుతూనే వుంటారు.

అహంకారం కాంగ్రెస్‌ను 400 స్థానాల నుంచి 44కి దిగజార్చగా దేశ సేవ పట్ల బీజేపికి వున్న అంకితభావం పార్టీని 2 నుంచి 282కు తీసుకొచ్చింది. 

విదేశాలతో ఎన్డీఏ సర్కార్ కొనసాగిస్తున్న సత్సంబంధాల గురించి చెబుతూ.. భారత్ ఇజ్రాయెల్ తో ఎంత స్నేహంగా ఉంటుందో పాలస్తినాతోనూ అంతే స్నేహంగా ఉంటుంది. అలాగే సౌది అరేబియా, ఇరాన్ దేశాలతోనూ అంతే స్నేహంగా మెదులుతుంది. ప్రస్తుతం ప్రపంచ వేదికలపై సైతం భారత్ తన గొంతుకను వినిపించడంలో విజయవంతమవుతోంది.

నిరుద్యోగం పెరిగిపోయిందన్న కాంగ్రెస్ ఆరోపణల్లో అర్థమే లేదు. గడిచిన నాలుగేళ్లలో దేశంలో 6 లక్షలకుపైగా వృత్తి నిపుణులు తమ ఉనికిని చాటుకున్నారు.

ఎన్డీఏ అధికారంలోకొచ్చినప్పటికీ ఆగిపోయి వున్న 99 వ్యవసాయ సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం పూర్తి చేసింది.

ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఎన్డీఏ ఎంతో కీలక పాత్ర పోషించింది. ఖరీదైన ఆరోగ్యాన్ని నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ సర్కార్ ఎంతో కృషిచేసింది. మోకాలి శస్త్రచికిత్సలు, స్టెంట్స్, ఔషదాలను అందరికీ అందుబాటులో వుండేలా ధరలను నియంత్రించడంలో సఫలం. 

కాంగ్రెస్ పార్టీని నిర్విర్యం చేయాలని స్వయంగా మహాత్మా గాంధీనే సూచించారు. అందుకే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది తన నినాదం కాదు.. తాను కేవలం ప్రధాని నరేంద్ర మోదీ కోరికను నిజం చేస్తున్నాను అంతే. 

కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఆత్మహత్యతో సమానం అని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు.

Trending News