డీజిల్ ధరను అందుకోలేని పెట్రోల్ ధరలు.. వాహనదారులకు వాత

గత మూడు వారాల నుంచి ఇంధన ధరలు వరుసగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఒక్కరోజూ ధరలు స్థిరంగా కొనసాగాయి. నేడు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.

Last Updated : Jun 30, 2020, 08:17 AM IST
డీజిల్ ధరను అందుకోలేని పెట్రోల్ ధరలు.. వాహనదారులకు వాత

గత రికార్డులన్నీంటిని బద్దలుకొడుతున్న పెట్రో ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 22రోజులు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజు (ఆదివారం) ధరలు పెంచలేదు. కానీ ఒకరోజు తర్వాత నేడు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడం (Petrol Price Today) తో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. వణికిస్తోన్న కరోనా.. భాగ్యనగరంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా!

(Petrol Price In Delhi) సోమవారం చమురు మార్కెటింగ్ సంస్థలు ఉన్న ధరలకు అదనంగా లీటరు పెట్రోల్‌పై 0.05పైసలను .. డీజిల్‌పై 0.13పైసలను పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు 80.43 రూపాయలకు పెరగగా.. డీజిల్‌ 80.53 రూపాయలకు చేరుకుంది. పెట్రోల్ కన్నా డీజిల్ అధిక ధరలో కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ 

Trending News