సఫాయి కార్మికుల కాళ్ళు కడిగిన ప్రధాని మోదీ, వలకార్మికులను ఎందుకు విస్మరించినట్టు? సంజయ్ రౌత్..

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకార్మికుల బాధలు వర్ణనాతీతం. అయితే ఇదే క్రమంలో శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ సామ్నా పత్రిక సంపాదకీయంలో ఘాటైన విమర్శలు చేశారు.

Last Updated : May 25, 2020, 12:58 AM IST
సఫాయి కార్మికుల కాళ్ళు కడిగిన ప్రధాని మోదీ, వలకార్మికులను ఎందుకు విస్మరించినట్టు? సంజయ్ రౌత్..

ముంబై: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకార్మికుల బాధలు వర్ణనాతీతం. అయితే ఇదే క్రమంలో శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ సామ్నా పత్రిక సంపాదకీయంలో ఘాటైన విమర్శలు చేశారు. సంజయ్ రౌత్ స్పందిస్తూ సఫాయి కార్మికుల కాళ్లు కడిగిన ప్రధాని మోదీ మనసు ఇప్పుడు బలహీనమై పోయిందని శివసేన అధికార పత్రిక (Saamana) సామ్నాలో తన వారాంతపు కాలమ్‌లో రౌత్ అన్నారు.

Also Read: TTD: టీటీడీ ఆస్తులను అమ్ముకునే హక్కు ఎవరిచ్చారు.. జగన్ సర్కార్ పై బండి సంజయ్ ఫైర్...

కరోనా వైరస్ లాక్‌డౌన్ (Lockdown) దశలో ప్రధానిలో మానవత్వం కనుమరుగైనట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిశుద్ధ కార్మికులు సమాజానికి దేవుళ్లు అని, వారణాసిలో నలుగురు పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగారని, అయితే ఇప్పుడు వారి స్థితిగతుల గురించి పట్టించుకోవడం లేదని రౌత్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ దశలో వలసకూలీల దుస్థితిపై నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు కశ్మీరీ పండిట్ల నిర్వాసిత వ్యవహారాన్ని రాజకీయం చేయడం, కాగా ప్రస్తుత వలసకూలీల పరిస్థితి సారూప్యత వంటి తన అభిప్రాయాలను సామ్నా పత్రికలో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News