PM Kisan Status: పీఎం కిసాన్ నగదు రూ.2000 రాలేదా, రైతులు ఇలా ఫిర్యాదు చేయాలి

PM Kisan Samman Nidhi 8th Installment: మే 14వ తేదీన 9.5 కోట్ల మందికి రూ.2000 చొప్పున మొత్తం రూ.19,000 కోట్లు విడుదల చేశారు. ఓవరాల్‌గా ఇది 8వ విడత. రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని, వివరాలు చెక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతులను మరోసారి అప్రమత్తం చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : May 19, 2021, 05:52 PM IST
PM Kisan Status: పీఎం కిసాన్ నగదు రూ.2000 రాలేదా, రైతులు ఇలా ఫిర్యాదు చేయాలి

PM Kisan Status : పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా ఈ ఏడాది తొలి విడత (ఏప్రిల్ - జూలై) నగదును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. మే 14వ తేదీన 9.5 కోట్ల మందికి రూ.2000 చొప్పున మొత్తం రూ.19,000 కోట్లు విడుదల చేశారు. ఓవరాల్‌గా ఇది 8వ విడత. రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని, వివరాలు చెక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతులను మరోసారి అప్రమత్తం చేసింది.  

రైతులకు రూ.2000 బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అవ్వకపోతే ముందుగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి. లేకపోతే పీఏం కిసాన్ (PM Kisan Samman Nidhi ) హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకుని చెప్పాలని గుర్తుంచుకోండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాది మొత్తం రూ.6,000 రైతులకు జమ చేసి ఆర్థిక చేయూత అందిస్తుంది.

Also Read: PM Kisan Beneficiary List: రైతుల ఖాతాల్లోకి రూ.2000, మీరు లబ్దిదారులేనా, జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి

- పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ : 18001155266
- పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ : 155261
- పీఎం కిసాన్ ల్యాండ్‌లైన్ నెంబర్స్ 011 - 23381092, 23382401 
- పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ అదనపు నెంబర్ : 0120-6025109
- పీఎం కిసాన్ ఈమెయిల్ ఐడీ : pmkisan-ict@gov.in   

Also Read: Remdesivir Injection: కరోనా బాధితులకు రెమిడెసివర్ ఆపివేస్తారా, డాక్టర్ ఏమన్నారంటే

How To Check PM Kisan Transactions: పీఎం కిసాన్ పథకం లావాదేవిలు ఎలా చెక్ చేయాలో తెలుసా
1) పీఎం కిసాన్ అర్హులైన రైతులు http://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించాలి  

2) అందులోని మెను బార్‌లో కుడివైపు ఉన్న Farmer's Corner ఆప్షన్ మీద క్లిక్ చేయండి

3) ఆ తరువాత Beneficiary Status మీద క్లిక్ చేయాలి

4) ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్‌లలో ఏదైనా ఓ ఆప్షన్ ద్వారా నగదు బదిలీల వివరాలు తెలుసుకోవచ్చు.

5) వివరాలు నమోదు చేసిన తరువాత GEt Data మీద క్లిక్ చేస్తే పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

Also Read: PM Kisan Samman Nidhi Status: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ, PM Kisan స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

మొబైల్ యాప్‌లో మీ పేరు చెక్ చేసుకునే విధానం
ముందుగా మీరు పీఎం కిసాన్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం మీ వివరాలు అన్ని పరిశీలించాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2 హెక్టార్ల వరకు సొంత భూమి కలిగి ఉన్న రైతులకు వర్తిస్తుంది. అయితే భూమి రైతు పేరిట ఉండాలని కొన్ని నిబంధనలు ఉన్నాయి. డిసెంబర్ 2018లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఆర్థిక చేయూత అందిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News