Marriage Age: అమ్మాయిల కనీస వివాహ వయస్సు ఎంత ఉండబోతోంది?

దేశంలో త్వరలో అమ్మాయిల కనీస వివాహ వయస్సులో మార్పు రాబోతోంది. కమిటీ నివేదికల అనంతరం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Last Updated : Oct 16, 2020, 10:03 PM IST
Marriage Age: అమ్మాయిల కనీస వివాహ వయస్సు ఎంత ఉండబోతోంది?

దేశంలో త్వరలో అమ్మాయిల కనీస వివాహ వయస్సు ( Change in Girls minimum Age of marriage ) లో మార్పు రాబోతోంది. కమిటీ నివేదికల అనంతరం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశంలో అమ్మాయిలకు , అబ్బాయిలకు కనీస వివాహ వయస్సును 18-21 సంవత్సరాలుగా నిర్దారించారు.  అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్ల నిండనిదే వివాహానికి అనర్హులనేది చట్టం చెబుతున్నమాట. ఈ నిర్ణీత వయస్సు దాటితే తల్లిదండ్రుల ప్రమేయం లేకపోయినా అమ్మాయిలు, అబ్బాయిలు వివాహం చేసుకోవచ్చు. అబ్బాయిలపై కనీస వివాహ వయస్సు కంటే అమ్మాయిలకు నిర్ణయించిన కనీస వివాహ వయస్సులో మార్పు రావాలనేది చాలా కాలం నుంచి పెండింగులో ఉన్న అంశం. ఈ అంశంపై ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( prime minister narendra modi ) స్పష్టత ఇచ్చారు. 

అమ్మాయిల కనీస వివాహా వయస్సు ఎంత ఉండాలనే దానిపై ఇప్పటికే  కమిటీలు వేశామని..అ కమిటీల నివేదికలు అందిన తరువాత దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రదాని మోదీ స్పష్టం చేశారు. అయితే కమిటీలు ఇప్పటివరకూ నివేదిక ఎందుకివ్వలేదంటూ ఆడబిడ్డలు తనను ప్రశ్నిస్తున్నారని మోదీ చెప్పారు. నిపుణుల కమిటీ ( Experts committee ) నివేదిక వచ్చిన వెంటనే సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామన్నారు. 

దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి ఉంటోందని...గత ఆరేళ్లుగా తాము చేస్తున్న కృషి ఫలితంగా ఈ మార్పు వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శానిటరీ ప్యాడ్ లను కేవలం ఒక్క రూపాయికే అమ్మాయిలకు అందిస్తున్న సంగతి మోదీ గుర్తు చేశారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సు ప్రస్తావన వచ్చింది. అప్పట్నించి దేశమంతా ఈ విషయంపై ఆసక్తి చూపిస్తోంది. Also read: International Flights: 17 దేశాలకు వెళ్లేందుకు పౌరవిమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్, వివరాలు ఇవే!

Trending News