నరేంద్ర మోదీ సర్కార్ కీలక నిర్ణయం

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను కంట్రోల్ చేయడం కోసం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది.

Last Updated : Apr 7, 2020, 02:50 AM IST
నరేంద్ర మోదీ సర్కార్ కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను కంట్రోల్ చేయడం కోసం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది. దీంతో పార్లమెంట్ సభ్యులకు ఇచ్చే జీతాల్లో 30% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30శాతం విధించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ చట్ట సవరణ అమల్లోకి వచ్చినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ మీడియాకు వెల్లడించారు. 

Also read : Watch video: కేంద్రం లాక్ డౌన్ ఎత్తేసినా.. రాష్ట్రంలో నేను కొనసాగిస్తా: సీఎం కేసీఆర్

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గురించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లోని అందరు కేంద్రమంత్రులు, మాజీ ఎంపీలకు కూడా ఈ ఆదేశాలు వర్తించనున్నాయని స్పష్టంచేశారు. అంతేకాదు  రానున్న రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ పథకాన్ని రద్దు చేసి.. ఎంపీ ల్యాడ్స్ నిధులకు ఖర్చు చేసే రూ7,900 కోట్ల మొత్తాన్ని ఇకపై కన్సాలిడేటెడ్ ఫండ్ ఖాతాకు వెళ్తాయని కేంద్రం తేల్చిచెప్పింది. ఈమేరకు పార్లమెంట్ సభ్యుల జీతాలు, పెన్షన్ల చట్టం-1954ని సవరిస్తూ సోమవారం కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 

Also read : కరోనావైరస్ ఎక్కువైన జిల్లాల జాబితా.. దేశంలోనే 4వ స్థానంలో హైదరాబాద్

ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతు పలుకుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రాల గవర్నర్‌లు సైతం పార్లమెంట్ సభ్యుల తరహాలోనే 30 % తక్కువ జీతం తీసుకునేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవడం విశేషం.

Trending News