PM Narendra Modi pays tribute to Keshubhai Patel: అహ్మదాబాద్: బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ (92) (Keshubhai Patel) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల అనారోగ్య సమస్యలతో అహ్మదాబాద్‌లోని స్టెర్లింగ్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కేశూభాయ్ పటేల్ ఆరోగ్యం విషమించడంతో గురువారం (Keshubhai Patel Passed Away) తుదిశ్వాస విడిచారు. సెప్టెంబరులో ఆయన అటెండెంట్‌కు కరోనా సోకడంతో.. కేశూభాయ్ కూడా పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా తేలింది. అయితే.. కొన్నిరోజులపాటు ఇంట్లోనే చికిత్స పొందిన కేశుభాయ్.. ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడకపోవడంతో.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. Also read: Keshubhai Patel Death News: గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ కన్నుమూత
PM Narendra Modi pays last tribute to Keshubhai Patel, Former Chief Minister of Gujarat, at the latter's residence in Gandhinagar.
Keshubhai Patel passed away yesterday. pic.twitter.com/3KyfjHVnGd
— ANI (@ANI) October 30, 2020
కేశూభాయ్ పటేల్‌కు నివాళులర్పించడంతోపాటు.. గుజరాత్ (Gujarat) లో రెండు రోజులు పర్యటించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. ముందుగా మోదీ గాంధీనగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ నివాసానికి చేరుకోని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశుభాయ్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేశుభాయ్ పటేల్ సేవలను స్మరించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ మ్యుజిషియన్ మహేశ్ కనోడియా కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి సంతాపం తెలియజేశారు.
Gandhinagar: PM Narendra Modi meets the family members of brothers Mahesh and Naresh Kanodia who passed away recently.
Mahesh Kanodia was a musician and former BJP MP from Gujarat, while Naresh Kanodia was an actor. #Gujarat pic.twitter.com/Tvps6w0J9s
— ANI (@ANI) October 30, 2020
ముందుగా నరేంద్ర మోదీకి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అయితే.. ప్రధాని మోదీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంత్యుత్సవాల సందర్భంగా కేవడియాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe