Policeman seen stealing packets of milk in Noida: పోలీస్ దొంగ..!!

పోలీస్ దొంగ.. అవును.. మీరు చదివింది నిజమే. ఈ పోలీసు చేసే పని చూస్తే .. నిజమేనని మీరూ నమ్మక తప్పదు. ఇంతకీ ఈ పోలీసు ఏం దొంగతనం చేశాడు..? ఎక్కడ దొంగతనం చేశాడు.. ? తెలుసుకోవాలనుకుంటున్నారా...? ఐతే చూడండి. 

Last Updated : Jan 21, 2020, 11:21 AM IST
Policeman seen stealing packets of milk in Noida: పోలీస్ దొంగ..!!

పోలీస్ దొంగ.. అవును.. మీరు చదివింది నిజమే. ఈ పోలీసు చేసే పని చూస్తే .. నిజమేనని మీరూ నమ్మక తప్పదు. ఇంతకీ ఈ పోలీసు ఏం దొంగతనం చేశాడు..? ఎక్కడ దొంగతనం చేశాడు.. ? తెలుసుకోవాలనుకుంటున్నారా...? ఐతే చూడండి.  
ఉత్తరప్రదేశ్.. నోయిడా సిటీలో మనోడు పోలీసుగా ఉద్యోగం వెలగబెడుతున్నాడు. అర్ధరాత్రి డ్యూటీ చేస్తున్నాడు. ఐతే అర్ధరాత్రి సిటీలో దొంగతనాలు, ఆకతాయిల చేష్టలను అరికట్టాల్సిందిపోయి ..ఏకంగా మనోడే దొంగతనానికి దిగాడు. అదీ చీప్‌గా పాల ప్యాకెట్ల కోసం కక్కుర్తి పడ్డాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఐతే ఈ పోలీసు దొంగ.. పాల ప్యాకెట్లు దొంగతనం చేస్తుండగా .. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ తతంగమంతా రికార్డయింది.

చూశారా..! ఖాకీ కక్కుర్తి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. ఎవరూ చూడలేదనుకుంటుంది. అలాగే ఈ పోలీసు కూడా ముఖానికి రుమాలు చుట్టుకుని తనను ఎవరూ చూడడం లేదని అనుకున్నట్టున్నాడు. యూపీ సర్కారు అడుగడుగునా ఏర్పాటు చేసిన నిఘా నేత్రానికి  (సీసీ కెమెరా) దొరికిపోయాడు. సాధారణంగా ఆకలేసి దొంగతనం చేసినోన్ని మక్కిలిరగతంతారు. మరి సాటి  పోలీసు దొంగపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Read Also: ఢిల్లీలో దోపిడీ దొంగల హల్‌చల్

Trending News