DRDO: భారత రక్షణ దళంలో మరో ఆయుధం, అత్యాధునిక వారుణాస్త్ర సిద్ధం

భారత రక్షణ దళానికి మరో శక్తివంతమైన ఆయుధం వచ్చి చేరింది. సముద్రగర్భంలో..శత్రుదేశపు సబ్ మెరైన్ ధ్వంసం చేసే టార్పెడో ఇది. పేరు వారుణాస్త్ర. వివరాలివీ…

Last Updated : Nov 22, 2020, 06:29 PM IST
DRDO: భారత రక్షణ దళంలో మరో ఆయుధం, అత్యాధునిక వారుణాస్త్ర సిద్ధం

భారత రక్షణ దళానికి మరో శక్తివంతమైన ఆయుధం వచ్చి చేరింది. సముద్రగర్భంలో..శత్రుదేశపు సబ్ మెరైన్ ధ్వంసం చేసే టార్పెడో ఇది. పేరు వారుణాస్త్ర. వివరాలివీ…

భారత రక్షణ పరిశోధన సంస్థ ( DRDO ) కు చెందిన  నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్త్ లేబొరేటరీ ఈ అధునాత టార్బెడో ను డిజైన్ చేసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేసి..భారత నౌకాదళానికి అప్పగించింది.  సముద్రగర్భంలోని శత్రుదేశపు సబ్ మెరైన్ ధ్వసం చేయగలిగే అత్యంత బరువైన టార్పెడో ఇది. పేరు వారుణాస్త్ర. విశాఖపట్నంలోని బీడీఎల్ ను సందర్శించిన అనంతరం డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి..ఇండియన్ నేవీకు అప్పగించారు. 

ఇటీవలే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ( QRSAM ) విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని డీఆర్డీవో ( DRDO ) ఛైర్మన్ సతీష్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మొదటి వారుణాస్త్ర ( Varunastra )ను విజయవంతంగా తయారు చేసినందుకు అభినందనలు తెలిపారు. అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పెడో, ఈహెచ్ డబ్ల్యూటీ తయారీలో ప్రస్తుతం బీడీఎల్ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. యుద్ధనౌక నుంచి ఈ హెవీ వెయిట్ టార్పెడోను శత్రుదేశపు జలాంతర్గామిపై ప్రయోగించవచ్చు. 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైందిది. ప్రపంచంలో జీపీఎస్ ఆధారంగా దూసుకెళ్లే ఏకైక టార్పెడోగా ఖ్యాతి కెక్కనుంది ఈ వారుణాస్త్ర. Also read: Lunar Eclipse 2020: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసా..?

Trending News