Social Media: నెంబర్ వన్‌లో ప్రధాని మోదీ..రెండో స్థానంలో వైఎస్ జగన్

దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతలెవరు..దీనికి సమాధానం ఎవరేమి చెప్పినా సరే..సోషల్ మీడియాలో మాత్రం ప్రధాని మోదీ తొలి స్థానం దక్కించుకోగా..రెండో స్థానాన్ని వైెఎస్ జగన్ సాధించారు.

Last Updated : Nov 24, 2020, 11:52 AM IST
Social Media: నెంబర్ వన్‌లో ప్రధాని మోదీ..రెండో స్థానంలో వైఎస్ జగన్

దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతలెవరు..దీనికి సమాధానం ఎవరేమి చెప్పినా సరే..సోషల్ మీడియాలో మాత్రం ప్రధాని మోదీ తొలి స్థానం దక్కించుకోగా..రెండో స్థానాన్ని వైెఎస్ జగన్ సాధించారు.

ఇప్పటికే అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతలు ప్రధాని మోదీ ( pm modi ), వైఎస్ జగన్ ( Ys jagan ) లే  అంటోంది సోషల్ మీడియా. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, యూ ట్యూబ్ వేదికల్లో అత్యధిక ట్రెండ్స్ మోదీ, జగన్ పేర్లపై ఉన్నాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకూ మూడు నెలల సోషల్ మీడియా ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్స్ అనే సంస్థ వెల్లడించింది. ఈ 3 నెలల కాలంలో 95 మంది టాప్ పొలిటికల్ లీడర్లు, 5 వందల మంది అత్యున్నత ప్రభావశీలుర ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్స్ సంస్థ విశ్లేషించింది.

దాదాపు పది కోట్ల ఆన్ లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా తొలి నివేదిక వెలువడింది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, వికీ పీడియా, యూ ట్యూబ్ లలో అత్యధిక ట్రెండ్స్ ( Google trends ) ఈ ఇద్దరిపైనే ఉన్నాయి. ప్రధాని మోదీకు 2 వేల 171 ట్రెండ్స్ ఉండగా..రెండో స్థానంలో ఉన్న వైఎస్ జగన్ కు 2 వేల 137 ట్రెండ్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ మోదీకు అత్యంత సమీపంగా  నిలవడం విశేషం.  తరువాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలున్నాయి.

ఇక బ్రాండ్ స్కోర్ విషయంలోనూ 70 స్కోర్ తో మోదీ తొలి స్థానంలో నిలవగా..సోషల్ మీడియా వేదికల్లో ఫాలోవర్లు, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్ మెంట్ వంటివాటి ఆధారంగా బ్రాండ్ స్కోర్ అనేది నిర్ణయిస్తారు. ఇందులో రెండో స్థానాన్ని 36.43 స్కోర్ తో అమిత్ షా దక్కించుకున్నారు. ఇక బ్రాండ్ వాల్యూ విషయంలో కూడా మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. 336 కోట్ల బ్రాండ్ వాల్యూతో తొలి స్థానంలో నిలవగా..335 కోట్ల బ్రాండ్ వాల్యూతో అమిత్ షా రెండో స్ధానాన్ని దక్కించుకున్నారు. Also read: AP: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, భారీ వర్షాలు

Trending News