Drinking sanitiser: ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగాడు

శానిటైజర్ తయారీలో ఆల్కహాల్ ఓ భాగమనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆల్కహాల్‌తో శానిటైజర్‌ని తయారు చేస్తాం కదా అని ఆ శానిటైజర్‌నే ఆల్కహాల్ లాగా సేవిస్తే మాత్రం బతికే అవకాశాలు లేవనే సంగతి తెలియదో ఏమో కానీ జైలులో శానిటైజర్స్ తయారుచేస్తోన్న ఓ ఖైదీ మాత్రం అదే శానిటైజర్‌ని తాగి ప్రాణాలొదిలాడు. కేరళలోని పాలక్కడ్‌‌కి సమీపంలోని మలంబుర జిల్లా జైలులో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దేశంలో కరోనా వైరస్ కారణంగా మాస్కులు, శానిటైజర్స్ కొరత ఏర్పడటంతో ఇక్కడి జైలు అధికారులు ఖైదీల చేత మాస్కులు, శానిటైజర్స్ తయారు చేయిస్తున్నారు. అదే క్రమంలో రెండు చోరీ కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైలుకొచ్చిన రామన్‌కుట్టి అనే వ్యక్తి కూడా మాస్కులు, శానిటైజర్ తయారీలో పాల్గొన్నాడు. 

Last Updated : Mar 28, 2020, 02:00 AM IST
Drinking sanitiser: ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగాడు

పాలక్కడ్: శానిటైజర్ తయారీలో ఆల్కహాల్ ఓ భాగమనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆల్కహాల్‌తో శానిటైజర్‌ని తయారు చేస్తాం కదా అని ఆ శానిటైజర్‌నే ఆల్కహాల్ లాగా సేవిస్తే మాత్రం బతికే అవకాశాలు లేవనే సంగతి తెలియదో ఏమో కానీ జైలులో శానిటైజర్స్ తయారుచేస్తోన్న ఓ ఖైదీ మాత్రం అదే శానిటైజర్‌ని తాగి ప్రాణాలొదిలాడు. కేరళలోని పాలక్కడ్‌‌కి సమీపంలోని మలంబుర జిల్లా జైలులో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దేశంలో కరోనా వైరస్ కారణంగా మాస్కులు, శానిటైజర్స్ కొరత ఏర్పడటంతో ఇక్కడి జైలు అధికారులు ఖైదీల చేత మాస్కులు, శానిటైజర్స్ తయారు చేయిస్తున్నారు. అదే క్రమంలో రెండు చోరీ కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైలుకొచ్చిన రామన్‌కుట్టి అనే వ్యక్తి కూడా మాస్కులు, శానిటైజర్ తయారీలో పాల్గొన్నాడు. 

Read also : ఆ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని వాయిదా వేసిన కేంద్రం

శానిటైజర్ తయారు చేసే క్రమంలోనే ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగేసిన రమన్ కుట్టి వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది హుటాహుటిన ఆ ఖైదీని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డే చికిత్స పొందుతూ రమణ్ కుట్టి మృతిచెందాడు. శానిటైజర్ తయారీలో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌ను వినియోగిస్తారు. దీంతో రామ‌న్ అది ఆల్కాహాల్ అనుకోని శానిటైజ‌ర్ తాగి ఉండొచ్చ‌ని జైలు అధికారులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.  

Read also : తెలంగాణలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు

పాలక్కడ్ జైలు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తోటి ఖైదీలు వద్దని వారిస్తున్నప్పటికీ వినిపించుకోకుండా రామన్ శానిటైజర్ సేవించాడని తెలిసినట్టుగా తెలిపారు. జైలులో ఖైదీ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం రామన్ మృతదేహాన్ని అతడి బంధువులకు అప్పగించినట్టు జైలు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటన అనంతరం జైలులో మాస్కులు, శానిటైజర్స్ తయారీని నిలిపేసినట్టు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News