పేదల కడుపు ఎండబెడుతున్నారు : ప్రియాంక గాంధీ వాద్రా

 దేశంలో నిత్యావసర వస్తువుల పెరుగుదల, కూరగాయల ధరలపెరుగుదల సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.  

Last Updated : Jan 14, 2020, 04:54 PM IST
పేదల కడుపు ఎండబెడుతున్నారు : ప్రియాంక గాంధీ వాద్రా

న్యూ ఢిల్లీ : దేశంలో నిత్యావసర వస్తువుల పెరుగుదల, కూరగాయల ధరలపెరుగుదల సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ఐదున్నరేళ్లలో రిటైల్ ద్రవ్యోల్బణం గత డిసెంబర్ 2019లో 7.35 శాతం గరిష్ట స్థాయికి పెరిగిందని, రిజర్వు బ్యాంకు కంఫర్ట్ స్థాయిని అధిగమించిందని ఆమె అన్నారు. ప్రధానంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటాయని, మిగతా కూరగాయల ధరలు కూడా ఖరీదైనయ్యాయని ఆమె అన్నారు. 

కూరగాయలు, ఇతర తినదగిన వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని, కూరగాయలు, నూనె, పప్పుధాన్యాలు మరియు పిండి వంటివి  ఖరీదైనప్పుడు పేదలు ఎలా తింటారని ఆమె అన్నారు.  ఆర్థిక మాంద్యం కారణంగా పేదలకు ఉపాధి లేకుండా పోయిందని, బీజేపీ ప్రభుత్వం పేదల జేబులను చిల్లు చేయడమే కాకుండా, పేదల కడుపు ఎండబెడుతున్నారని అని ఆమె ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News