Congress President Poll: ఏఐసీసీ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే..? కొనసాగుతున్న నామినేషన్ల పర్వం..!

Congress President Poll: కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. పలువురు నేతలు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 30, 2022, 03:44 PM IST
  • కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల హడావిడి
  • పలువురు నేతల నామినేషన్లు
  • త్వరలో ఎన్నికలు
Congress President Poll: ఏఐసీసీ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే..? కొనసాగుతున్న నామినేషన్ల పర్వం..!

Congress President Poll: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నామినేషన్లు వేసేందుకు నేతలంతా ఏఐసీసీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. పదవికి పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించిన ఎంపీ శశిథరూర్..తాజాగా నామినేషన్లు వేశారు. అంతకముందు భారీ ర్యాలీ ద్వారా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. 

ర్యాలీకి ముందు రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఇటు అనూహ్యంగా పోటీలో వచ్చారు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. ఆయన సైతం నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఖర్గేను పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. ఇటు మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. మల్లికార్జున్ ఖర్గేకు మద్దతు తెలిపారు. గాంధీ విధేయుడిగా ఖర్గేకు పేరుంది.

అదికాక పార్టీ అధిష్టానం మద్దతు ఖర్గేకు ఉంది. దీంతో ఆయన గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ నేతలు అశోక్ గహ్లోత్, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్ నేతలతోపాటు జీ23 నేతలు ఆయననే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఈక్రమంలో ఖర్గే తప్పకుండా గెలుస్తారని..తదుపరి అధ్యక్షుడు ఆయనేనని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మూడో నామినేషన్ దాఖలు అయ్యింది.

తాను కూడా పోటీ చేస్తున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం కేఎల్ త్రిపాఠి వెల్లడించారు. ఖర్గే తర్వాత ఆయననే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు ఇవాళ చివరి తేదీ. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడించనున్నారు. 

తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. నేతగానే భారత్ జోడో పాదయాత్ర చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. గాంధీయేతర వ్యక్తే అధ్యక్షుడు కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దీంతో కొత్త వ్యక్తి రావడం ఖాయమైంది.

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..!

Also read:National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఉచ్చు బిగిస్తోందా..? పలువురికి నోటీసులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News