National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ జోరు పెంచింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసింది. హస్తం పార్టీకి, పార్టీ అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన నేతలకు నోటీసులు ఇచ్చారు. ఇటు ఈడీ నోటీసులు అందుకున్న నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో నేతలంతా హస్తినకు మకాం మార్చారు. కొందరు నేతలు నిన్నే అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది నేతలు ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లారు.
కాసేపట్లో ఆడిటర్లతో కాంగ్రెస్ నేతలు సమావేశంకానున్నారు. నేషనల్ హెరార్డ్ కేసులో ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు. విడతల వారిగా ఇద్దరిని సుదీర్ఘంగా విచారించారు. మనీ లాండరింగ్ జరిగిందా అన్న కోణంలో పలు ప్రశ్నలు సంధించారు. ఐతే దీనిపై ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఇదే కేసులో విరాళాలు ఇచ్చిన పలువురు నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఢిల్లీలో ఉన్న నేతలకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక క్లాస్ తీసుకోనుంది. కేసు పూర్వాపరాల గురించి వివరించనుందని తెలుస్తోంది. ఆడిట్ పరంగా, న్యాయ పరంగా పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు షబీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, మాజీ ఎంపీలు రేణుకా చౌదరి, అంజన్ కుమార్, ఇతర నేతలు ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో మరికొంత మంది నేతలకు నోటీసులు అందజేసే అవకాశం ఉంది.
ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. విడతల వారిగా కేసును విచారిస్తోంది. ఈకేసులో మనీలాండరింగ్ జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో మనీలాండరింగ్ చుట్టే కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే రాహుల్, సోనియా గాంధీని విడతల వారిగా అధికారులు విచారించారు. ఈసందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. త్వరలో మరోసారి విచారిస్తారని సమాచారం అందుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపతున్నారు. రాజకీయ కక్షతోనే దాడులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సామాజిక బాధ్యతతో నేషనల్ హెరాల్డ్‌ను రాహుల్ గాంధీ తిరిగి ప్రారంభాలని గుర్తు చేస్తున్నారు. అలాంటి వారిపై కక్ష సాధింపు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Also read:AP Govt: నిరుద్యోగులకు శుభవార్త..కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం..!
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.