PUBG Comeback: చైనా సంస్థతో పబ్ జీ తెగతెంపులు..బ్యాన్ తొలిగే అవకాశం ? 

భారత ప్రభుత్వం ( Indian Government ) రెండు సార్లు చైనా యాప్స్ ను ( Ban On China Apps ) బ్యాన్ చేసినప్పడు పబ్ జీ సేఫ్ అయింది. కానీ మూడో దెబ్బలో పబ్ జీ గేమ్ ఓవర్ అయింది. 

Last Updated : Sep 8, 2020, 06:24 PM IST
    • భారత ప్రభుత్వం ( Indian Government ) రెండు సార్లు చైనా యాప్స్ ను ( Ban On China Apps ) బ్యాన్ చేసినప్పడు పబ్ జీ సేఫ్ అయింది.
    • కానీ మూడో దెబ్బలో పబ్ జీ గేమ్ ఓవర్ అయింది. అయితే పబ్ జీ చైనా కంపెనీ కాదు అని అందరికీ తెలుసు.
    • ఈ యాప్ ను పబ్లిష్ చేసే సంస్థ మాత్రం చైనాకు చెందిన టాంసెంట్ ( Tancent ) సంస్థ. దాంతో పబ్ జీ పై వేటు తప్పలేదు.
PUBG Comeback:  చైనా సంస్థతో పబ్ జీ తెగతెంపులు..బ్యాన్ తొలిగే అవకాశం ? 

భారత ప్రభుత్వం ( Indian Government ) రెండు సార్లు చైనా యాప్స్ ను ( Ban On China Apps ) బ్యాన్ చేసినప్పడు పబ్ జీ సేఫ్ అయింది. కానీ మూడో దెబ్బలో పబ్ జీ గేమ్ ఓవర్ అయింది. అయితే పబ్ జీ చైనా కంపెనీ కాదు అని అందరికీ తెలుసు. ఈ యాప్ ను పబ్లిష్ చేసే సంస్థ మాత్రం చైనాకు చెందిన టాంసెంట్ ( Tancent ) సంస్థ. దాంతో పబ్ జీ పై వేటు తప్పలేదు. భారత్ లో బ్యాన్ అయిన తరువాత పబ్ జీ  (PUBG ) నిర్వాహకులు ఎట్టిపరిస్థితిలో మళ్లీ భారత్ లో తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు.

తాజాగా పబ్ జీ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో సంస్థ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపింది. యాప్ ను పబ్లిష్ చేసే బాధ్యతను చైనా సంస్థ అయిన టాంసెంట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది.  ప్రైవసీ, సెక్యూరిటీ విషయం గురించి ఆలోచించి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని సంస్థ తెలిపింది.  ఈ విషయంలో భారత ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 

PUGB అంటే PLAYERUNKNOWN'S BATTLEGROUND (PUBG) అనేది దక్షిణ కొరియాకు చెందిన పబ్ జీ కార్పోరేషన్  లో మేథోసంపత్తి అని అది చైనాకు చెందిన సంస్థ కాదు అని తెలిపింది. అయితే యాప్ ను పబ్లిష్ చేసే బాధ్యత మాత్రం చైనాకు చెందిన టాంసెంట్ అనే సంస్థకు ఇచ్చాము అని తెలిపింది.  అయితే టాంసెంట్ తో దాని ఒప్పందం రద్దు చేసుకున్నాక అది మళ్లీ భారత్ లో ప్రవేశించాలి అని భావిస్తోంది అని తెలిపింది. అంతా సెట్ అయితే పబ్ జీ మళ్లీ కమ్ బ్యాక్ చేసే అవకాశం ఉంది.

 

Trending News