Rape: చాక్లెట్‌కు డబ్బులిస్తానని చెప్పి-నాలుగేళ్ల చిన్నారిపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారం

Rape on 4 year old girl : నాలుగేళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్ర పుణేలోని పింప్రి చించ్వాడ్‌లో చోటు చేసుకుంది. చాక్లెట్ కొనుక్కునేందుకు డబ్బులిస్తానని చెప్పి చిన్నారిపై అతను అత్యాచారానికి ఒడిగట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 11:44 AM IST
  • పుణేలో నాలుగేళ్ల చిన్నారిపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారం
  • చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై లైంగిక దాడి
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Rape: చాక్లెట్‌కు డబ్బులిస్తానని చెప్పి-నాలుగేళ్ల చిన్నారిపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారం

Rape on 4 year old girl : మహారాష్ట్రలోని (Maharashtra) పుణేలో (Pune) దారుణం వెలుగుచూసింది. ఓ 12 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల చిన్నారిపై (Minor girl raped) అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తానని చెప్పి ఆమెపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడి ఆకృత్యాన్ని బాధిత చిన్నారి తల్లి గమనించింది. పుణేలోని పింప్రి చించ్వాడ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పింప్రి చించ్వాడ్ పరిధిలోని ఓ కాలనీలో బాధిత బాలిక (4) (Rape victim) కుటుంబం నివసిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓరోజు.. ఆడుకునేందుకని ఆ బాలిక తమ ఇంటి సమీపంలోనే ఉండే ఓ బాలుడి (12) ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆ బాలుడు చాక్లెట్ కొనుక్కునేందుకు డబ్బులిస్తానని చెప్పి చిన్నారిపై లైంగిక దాడికి (Sexual assault) పాల్పడ్డాడు. ఆడుకునేందుకు వెళ్లిన తన బిడ్డ ఇంకా తిరిగి రాకపోవడంతో తల్లి ఆ చిన్నారి కోసం వెతుక్కుంటూ నిందితుడి ఇంటికి వెళ్లింది.

అక్కడ తన బిడ్డపై అతను లైంగిక దాడికి పాల్పడటం గమనించింది. వెంటనే తన బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చిన ఆ తల్లి... ఆ తర్వాత పింప్రి చించ్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 (RAPE), పోక్సో చట్టం (Protection of Children from Sexual Offences) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: Omicron Variant Alert: ఒమిక్రాన్ సోకితే..ప్రాణాలకు పెనుముప్పే, తస్మాత్ జాగ్రత్త

కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బిజ్నోర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఆరేళ్ల చిన్నారిపై 26 ఏళ్ల ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి స్కూల్ నుంచి తిరిగొస్తున్న క్రమంలో... ఆమెకు మాయ మాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత నెలలో కేరళలోని మలప్పురం జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నం (Crime against Women) చేశాడు. బాలిక కంప్యూటర్ క్లాస్ నుంచి తిరిగొస్తుండగా ఆమెను వెంబడించి నిర్మానుష్య ప్రదేశంలోకి లాక్కెళ్లాడు. బాలిక గట్టిగా ప్రతిఘటించి అతని బారి నుంచి తప్పించుకుంది.  చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా స్త్రీలపై నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News