Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?

Pune Road Rage:  కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్‌ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Jul 21, 2024, 12:28 PM IST
Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?

Pune Road Rage: ఇటీవలె జరిగిన ముంబై పోర్షే కారు ఘటన మరువకముందే మరో కారు ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్‌ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. వివరాల్లోకి వెళితే..

Add Zee News as a Preferred Source

ఓ మహిళ తన పిల్లలతో కలిసి బనెర్‌ నుంచి పాషన్‌  రోడ్డు గుండా ద్విచక్ర వాహంపై వెళ్తోంది. అయితే, ఓ కారు ఓనర్‌ ఆమెను ఓవర్‌ టేక్‌ చేయసాగాడు. దీంతో ఆమె కారుకు దారి ఇవ్వలేదనే అక్కసుతో కారు ఓనర్‌ స్వప్నిక్‌ కెక్రే ఫాస్ట్‌గా పోనిచ్చి స్కూటీ ముందు ఆపాడు. కారు దారి ఇవ్వలేదన్న నేపంతో కారు దిగి ఆమెను ఒక్కసారిగా జుట్టు పట్టి లాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది.

వెంటనే సదరు మహిళ ఈ ఉదంతాన్ని వీడియో తీస్తూ ఏడుస్తూ చెప్పింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియోలో పూనెలో భద్రత కరువైంది. ఈ ఘటన రేపు మరొకరికి కూడా జరగవచ్చని వాపోయింది. ఈ ఘటన పోలీసుల దృష్టికి కూడా రావడంతో బాధిత మహిళ వివరాలను సేకరించి దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలను తెలుసుకున్నారు. శనివారం నిందితుడని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయనతోపాటు ఆ సమయంలో కారులో ఉన్న నిందితుడి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువే చోటు చేసుకుంటున్నాయి. సైడ్‌ ఇవ్వలేదనే కారణం, రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడుపుతూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు వాగ్వాదాలకు కూడా దిగుతున్నారు. పోలీసులు ఎలాంటి కఠినమై ట్రాఫీక్‌ రూల్స్‌ పెట్టనా కొందరూ ఆ రూల్స్‌ పాటించకపోవడం కూడా జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఒక్కోసారి దాడికి కూడా దిగుతున్నారు.

Also read: AP IAS Transfers: ఏపీలో కొనసాగుతున్న ఐఏఎస్ బదిలీలు, మరో 62 మందికి స్థానచలనం పూర్తి జాబితా ఇదే 

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News