Punjab Assembly polls 2022: పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కూటమి తన అధికారిక మ్యానిఫెస్టోను (BJP manifesto) శనివారం మధ్యాహ్నాం విడుదల చేసింది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని పలు తాయిలాలు ప్రకటించింది. జలంధర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, సోమ్ ప్రకాష్, బీజేపీ నాయకులు దుష్యంత్ గౌతమ్, తరుణ్ చుగ్, రణిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
BJP-Punjab Lok Congress-Shiromani Akali Dal (Sanyukt) alliance releases manifesto for Punjab Assembly elections, in Jalandhar.
"Punjab is a very sensitive border state & it is important for the state to have people in power who themselves are stable," says Union Minister HS Puri pic.twitter.com/A5nuT7ydJI
— ANI (@ANI) February 12, 2022
పంజాబ్ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 75 శాతం (75 percent reservation in all government jobs), ప్రైవేట్ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడం మేనిఫెస్టోలోని హైలైట్. పొరుగున ఉన్న హర్యానాలోని బిజెపి-జెజెపి ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో నివసించే యువకులకు ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని ఆమోదించింది.
కాంట్రాక్టు ఉద్యోగాలు సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది బీజేపీ కూటమి. మహిళలపై కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంది. డిగ్రీ పూర్తయ్యాక రెండేళ్ల దాకా నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి (unemployment allowance) ఇవ్వనున్నట్లు తెలిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని మేనిఫెస్టో వెల్లడించింది. 'ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు డోప్ టెస్ట్ తప్పనిసరి' అని పంజాబ్ ఎన్నికల (Punjab Assembly polls 2022) సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది.
Also Read: Viral news: సర్పంచ్ అభ్యర్థులకు ఎంట్రన్స్ ఎగ్జామ్.. పాస్ అయితేనే ఓట్లు.. ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook