లోక్ సభ ఎన్నికల చరిత్రలో భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీగా రికార్డు సృష్టించిన రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల చరిత్రలో భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీగా రికార్డు సృష్టించిన రాహుల్ గాంధీ

Last Updated : May 23, 2019, 11:35 PM IST
లోక్ సభ ఎన్నికల చరిత్రలో భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీగా రికార్డు సృష్టించిన రాహుల్ గాంధీ

వయనాడ్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచు కోటగా పేరున్న అమేథి లోక్ సభ స్థానం నుంచి ఓడిపోయినప్పటికీ.. ఆ ఓటమి ప్రభావాన్ని పెరగనీయకుండా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. భారత ఎన్నికల చరిత్రలోనే ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్ అక్కడి నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 8,38,371 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఏకైక ఎంపీగా రాహుల్ చరిత్ర సృష్టించారు. ఈ స్థాయిలో అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన ఏకైక ఎంపీగా రాహుల్ గాంధీ 17వ లోక్ సభలో అడుగుపెట్టబోతున్నారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీకి 13,38,371 ఓట్లు పోల్ కాగా అధికార ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి పీపీ సునీర్‌కు 4,99,067 ఓట్లు లభించాయి. 

లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సొంతం చేసుకున్న అభ్యర్థుల విషయానికొస్తే, 2014లో మహారాష్ట్రలోని బీడ్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నేత ప్రితమ్ గోపీనాథ్‌ రావు ముండే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పాటిల్‌పై ఆమె 6,96,321 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తన పేరిట రికార్డు సొంతం చేసుకున్నారు. అదే విధంగా సాధారణ ఎన్నికలో పశ్చిమ బెంగాల్‌ నుంచి పోటీచేసిన సీపీఎం అభ్యర్థి అనిల్ బసు అప్పట్లో 5,92,502 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ రికార్డులను చెరిపేస్తూ తాజాగా రాహుల్ గాంధీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఓ సరికొత్త రికార్డు కైవసం చేసుకున్నారు.

Trending News