టెన్త్ క్లాస్ అర్హత లేని వారు రెండో తరగతి పౌరులా ? - రాహుల్

చదువులేని వాళ్లను రెండో తరగతి పౌరుల్లా చూస్తోందని రాహుల్ మోడీ సర్కార్ పై ఘాటైన విమర్శలు

Last Updated : Jan 15, 2018, 04:52 PM IST
టెన్త్ క్లాస్ అర్హత లేని వారు రెండో తరగతి పౌరులా ? - రాహుల్

హైదాబాద్: టెన్త్ క్లాస్ అర్హత లేని వారు రెండో తరగతి పౌరులా ? అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ సర్కార్  ను ప్రశ్నించారు. వివరాల్లో వెళ్లినట్లయితే..10వ తరగతి పాస్ కానివారికి ఆరెంజ్ కలరె పాస్ పోర్టులు జారీ చేయాలని కేంద్ర తీసుకున్న నిర్ణయంపై రాహుల్ ఘాటుగా స్పందిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్ పోర్టు రంగు మార్చాలనుకోవడం ఎన్డీయే సర్కార్ వివక్షపూరిత చర్యలను సూచిస్తోందని విమర్శించారు. విదేశాలకు వెళ్లే కార్మికులను రెండో తరగతి ప్రయాణికుల్లా చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఆరెంజ్ పాస్ పోర్ట్ కథ ఇదే..

భారత విదేశాంగ శాఖ  పాస్ పోర్టుకు సంబంధించి చివరి పేజీలో చిరునామా వివరాలను తొలగించేలా ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇమ్మిగ్రేషన్ చెక్ కావాలనుకునేవారికి ఆరంజ్ కలర్ పాస్ పోర్టు ఇవ్వాలని నిర్ణయించింది. 10వ తరగతి పాస్ కాని వారికి ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ పాస్ పోర్టులను మంజూరు చేస్తారు. ఇలాంటివారు విదేశాలకు వెళ్లకముందే ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంపై 10వ తరగతి పాస్ కాని వారు విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.

Trending News