Rahul Gandhi, Priyanka Gandhi arrested: లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటన ఉదంతంపై ఆందోళనలు మిన్నంటాయి. మానవ మృగాల చేతిలో దళిత యువతి అత్యాచారానికి (hathras gang rape) గురై చికిత్స పొందుతూ మరణించగా.. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే పోలీసులు మంగళవారం అర్థరాత్రి దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం జ్వాలలు మిన్నంటాయి. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్యాన్వాయ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే పై పాదయాత్రగా హత్రాస్ వెళుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో పోలీసులు లాఠిఛార్జ్ చేసి బలవంతంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. దీంతో నోయిడ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కిందపడిపోయారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అరెస్టుకు ముందు తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు.. ఏ సెక్షన్ కింద అరెస్టు చేస్తున్నారో చెప్పాలని రాహుల్ గాంధీ పోలీసులను ప్రశ్నించారు. సెక్షన్ 188 ఐపిసి ఆర్డర్ ఉల్లంఘన కింద అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also read: Rahul Gandhi: మోదీజీ మాత్రమే దేశంలో నడుస్తారా..?
#WATCH Congress leaders Rahul Gandhi, Priyanka Gandhi, Adhir Ranjan Chowdhury, KC Venugopal & Randeep Surjewala being taken to Buddh International Circuit in Gautam Buddh Nagar, after they were detained by UP Police on their way to Hathras. pic.twitter.com/6XguHbmtrF
— ANI UP (@ANINewsUP) October 1, 2020
ఆ తర్వాత పోలీసులు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అధీర్ రంజన్ చౌదరి, కెసి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాను గౌతమ్ బుద్ధనగర్ లోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌కు తీసుకెళ్లారు. Also read: Hathras gang rape case: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. హత్రాస్ ఎస్పీ సంచలన వ్యాఖ్యలు