Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి ఝలక్‌‌ ఇచ్చిన సొంత టీమ్‌.. 'ఎందుకు ఇంత లేటు' అని ఆగ్రహం

Rahul Gandhi: సొంత టీమ్‌ రాహుల్‌ గాంధీకి ఝలక్‌ ఇచ్చింది. కీలక విషయంలో సొంత టీమ్‌ మరచిపోవడంతో రాహుల్‌ అవాక్కయ్యారు. ఈ వ్యవహారంలో తన టీమ్‌పై రాహుల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 7, 2024, 07:03 PM IST
Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి ఝలక్‌‌ ఇచ్చిన సొంత టీమ్‌.. 'ఎందుకు ఇంత లేటు' అని ఆగ్రహం

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల విషయంలో కీలక ప్రకటన చేయాల్సి ఉండగా రాహుల్‌ గాంధీ సొంత టీమ్‌ తప్పు చేసింది. చేయాల్సిన విషయాన్ని మరచిపోవడంతో రాహుల్‌ అవాక్కయ్యాడు. వెంటనే విషయం తెలుసుకుని టీమ్‌ను మందలించాడు. టీమ్‌ తప్పిదం గ్రహించి వెంటనే ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని రాహుల్‌ గాంధీ స్వయంగా తెలిపాడు. ఈ వ్యవహారం చాలా ఆసక్తిగా మారింది.

Also Read: Manne Krishank: మళ్లీ భంగపడ్డ మన్నె క్రిశాంక్‌.. ఈసారి టికెట్‌ రాకుంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామే!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఐదు న్యాయాలు పేరిట 'న్యాయ్‌ పత్ర' అనే మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ, జైపూర్‌తోపాటు తెలంగాణలో మేనిఫెస్టో సభలు జరిగాయి. తెలంగాణలో తుక్కుగూడ సభ శనివారం సాయంత్రం జరగ్గా తిరుగు ప్రయాణంలో రాహుల్‌ గాంధీ ఒక ప్రకటన చేయాలనుకున్నారు. ఈ సందర్భంగా ఒక వీడియో తీశారు. ఆ వీడియోను వెంటనే పోస్టు చేయాలని తన వ్యక్తిగత టీమ్‌కు రాహుల్‌ సూచించారు. అయితే పది పదిహేను గంటలు దాటినా చెప్పిన పని చేయకపోవడంతో రాహుల్‌ విస్మయం వ్యక్తం చేశాడు. వెంటనే గ్రహించి తాను చెప్పాలనుకుంటున్న విషయానికి సంబంధించిన వీడియోను ఎట్టకేలకు విడుదల చేశారు.

Also Read: KCR Arrest: కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఇదేనా?

'తెలంగాణ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రాత్రి 12.30 గంటలకు ఈ వీడియో చేశారు. కానీ నా టీమ్‌ చాలా ఆలస్యంగా పోస్టు చేసింది. ఈ పోస్టుకు ఎంతో ప్రాధాన్యం ఉండడంతో ఇప్పుడు ఈ వీడియోను మీతో పంచుకుంటున్నా' అని రాహుల్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అయితే ఆ వీడియోలో రాహుల్‌ గాంధీ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ విడుదల చేసిన 'న్యాయ్‌ పత్ర' మేనిఫెస్టోపై అభిప్రాయాలు చెప్పాలని ప్రజలను కోరారు. 'ప్రతి భారతీయుడి గొంతుక కాంగ్రెస్‌ మేనిఫెస్టో. మేనిఫెస్టోపై మీ ఆలోచనలు సోషల్‌ మీడియా ద్వారా పంచుకోండి' అని సూచించారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఐదు న్యాయాలు ఉన్న విషయం తెలసిందే. యువ న్యాయ్‌, నారీ న్యాయ్‌, కిసాన్‌ న్యాయ్‌, శ్రామిక్‌ న్యాయ్‌, హిస్సేదారి న్యాయ్‌ అనేవి ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మిశ్రమ స్పందన లభిస్తోంది.
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x