స్టెరిలైట్ బాధితులను పరామర్శించిన రజినీకాంత్

రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత సినీ నటుడు రజనీకాంత్‌ తూత్తుకుడి పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

Last Updated : May 30, 2018, 12:16 PM IST
స్టెరిలైట్ బాధితులను పరామర్శించిన రజినీకాంత్

రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత సినీ నటుడు రజనీకాంత్‌ తూత్తుకుడి పర్యటనకు బయల్దేరి వెళ్లారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న స్టెరిలైట్ బాధితులను ఆయన పరామర్శించారు.  స్టెరిలైట్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు జరిపిన కాల్పులలో 13 మంది మరణించిన సంఘటన తెలిసిందే. ఆందోళనలకు దిగివచ్చిన సర్కార్ స్టెరిలైట్ కంపెనీ మూసివేతకు ఆదేశాలు కూడా జారీ చేసింది.

 

 

తూత్తుకుడి ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీ అన్నారు. తూత్తుకుడి ఘటన అమానవీయమన్నారు. 'స్టెరిలైట్‌ ఆందోళనకు రాజకీయాల్ని జత చేసి, ప్రభుత్వం ఇంటలిజెన్స్‌‌ డిపార్ట్‌మెంట్‌ను దుర్వినియోగం చేసింది. భద్రతా బలగాలు క్రూరంగా ప్రవర్తించడాన్ని నేను ఖండిస్తున్నా. మృతి చెందిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని రజనీ వీడియోతో కూడిన సందేశాన్ని  ఇటీవలే పోస్టు చేసిన సంగతి తెలిసిందే!

 

Trending News