Ration Card: రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొందరు అనర్హులు పొందుతున్న విషయాన్ని గుర్తించి..కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులు స్వచ్ఛందంగా ముందు వచ్చి..రేషన్ కార్డును రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చింది. వంద చదరపు మీటర్ల ప్లాట్/ప్లాట్/ఇల్లు, ఫోర్ వీలర్, ఆయుధ లైసెన్స్, కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.2 లక్షలు, పట్టణాల్లో రూ.3 లక్షలు మించిన వారు తమ రేషన్ కార్డు సరెండ్ చేయాలని హెచ్చరించింది.
స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో సరెండ్ చేయాలని..లేదంట్ తీవ్రమైన పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. కరోనా తర్వాత ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం విడతల వారిగా పంపిణీ చేస్తోంది. దీంతో సర్కార్‌పై భారం పడుతోంది. కొందరు అనర్హులు ఉచిత రేషన్ పొందుతున్నారని ఇటీవల ప్రభుత్వం గుర్తించింది. దీంతో అక్రమ కార్డులను తొలగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది.
త్వరలో క్షేత్ర స్థాయిలో అధికారులు సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దీనిపై దృష్టి పెట్టాయి. కొందరు ఉచిత బియ్యాన్ని పొంది..బ్లాక్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అదికాక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక చోట భారీగా బస్తాలు పట్టుపడుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనర్హులను గుర్తించి..రద్దు చేయాలని భావిస్తున్నాయి.
Also read:IND vs AUS: కొనసాగుతున్న కామెరూన్ గ్రీన్ విధ్వంసం..తాజాగా సరికొత్త రికార్డు..!
Also read:Chakali Ilamma: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook