Delhi lockdown: 'ఢిల్లీలో అవసరమైతే పూర్తి స్థాయి లాక్​డౌన్​కు రెడీ'

Delhi lockdown: కాలుష్య నివారణ కోసం అవసరమైతే లాక్​డౌన్ విధించేందుకు సిద్ధమని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. రాజధానిలో కాలుష్య నివారణ ప్రణాళికను సుప్రీం కోర్టుకు సమర్పించింది కేంద్రం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 10:38 PM IST
  • ఢిల్లీలో లాక్​డౌన్​కు సిద్ధమన్న కేజ్రివాల్ సర్కార్​
  • కాలుష్య నివారణకు సుప్రీం ఎదుట కేంద్రం ప్రణాళిక
  • అత్యున్నత న్యాయస్థానం విచారణ 17కు వాయిదా
Delhi lockdown: 'ఢిల్లీలో అవసరమైతే పూర్తి స్థాయి లాక్​డౌన్​కు రెడీ'

Delhi Government told the Supreme Court that it is ready to impose a complete lockdown: ఢిల్లీలో అత్యవసరమైతే పూర్తి స్థాయి లాక్​డౌన్ విధించేందుకు సిద్ధమని అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. రాజధాని నగరంలో వాయుకాలుష్యం (Delhi air pollution) తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై సుప్రీం కోర్టు నేడు అత్యవసర విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ విచారణలో భాగంగానే లాక్​డౌన్ విధించేందుకు (Lock down in Delhi) సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ రాహుల్‌ మెహ్రా తమ ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించారు. ఢిల్లీతో పాటు.. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్​సీఆర్) వ్యాప్తంగా లాక్​డౌన్ (Lock down in NCR) విధిస్తే మరింత ఫలితం ఉంటుందని కేజ్రివాల్ సర్కార్ ఆ ప్రణాళికలో పేర్కొంది.

ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో పంట కాల్చడం వల్లనే అధికంగా కాలుష్యం (Delhi pollution) పెరుగుతుందని కేజ్రివాల్ ప్రభుత్వం అఫిడవిట్​లో పేర్కొంది. దీనితో పాటు.. కాలుష్యం తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా కోర్టుకు వివరించింది. కాలుష్య నివారణ చర్యలపై సమగ్ర నివేదిక కావాలని, ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా చెప్పాలని అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also read: Tamilnadu: చెన్నైకు మరోసారి ముప్పు, రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

కేంద్రం ఏం చెప్పిందంటే..

కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు తమ ప్రణాళికను సమర్పించారు. వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల 10 శాతం మాత్రమే కాలుష్యం వస్తోందని కోర్టుకు వెల్లడించారు. నగరంలో కాలుష్యం తగ్గించేందుకు..  తాత్కాలికంగా విద్యుత్ కర్మాగారాలను నిలిపివేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేయడాన్ని ఆపేయడం వంటి సూచనలు కేంద్రం సమర్పించిన ప్రణాళికలో ఉన్నాయి.

ఈ అంశంపై విచారణను ఈ నెల 17కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు.. అంతకు ముందు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తర్​ ప్రదేశ్, హరియాణ, పంజాబ్​లలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులందరికి వీలైనంత మేరకు ఇంటి  దగ్గరి నుంచి పని చేసే వెసులుబాటు ఇచ్చింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.

Also read: Judiciary System: తీర్పులు ఎప్పుడూ సులభమైన భాషలోనే ఉండాలి

Also read: S400 Missiles: ఇండియాకు ఎస్ 400 క్షిపణుల సరఫరా ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News