దీపావళికి రిలయన్స్ జియో మరో బంపరాఫర్ !

దీపావళికి రిలయన్స్ జియో తీసుకొస్తున్న బంపర్ ఆఫర్స్ ఇవే

Updated: Oct 21, 2018, 08:56 PM IST
దీపావళికి రిలయన్స్ జియో మరో బంపరాఫర్ !

ఇప్పటికే భారీ స్థాయిలో ఆఫర్లు అందించి, అతి తక్కువ సమయంలో అత్యంత భారీ సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో తాజాగా రానున్న దీపావళికి మరో బంపరాఫర్‌ని అందించేందుకు సిద్ధమైంది. ఈ పండగ సీజన్‌లో రూ.149 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తం రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు మై కూపన్స్ రూపంలో 100% క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందించనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. అంతేకాకుండా ఇదే పండగ సీజన్‌లో రూ.1,699 ప్లాన్‌తో మరో కొత్త టారిఫ్‌ని వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సరికొత్త రూ.1,699 ప్లాన్‌తో ఏడాది పొడవునా రోజూ 1.5 GB హై స్పీడ్ డేటాతోపాటు అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో సినిమా, జియో టీవీ, జియో మ్యూజిక్, జియో మ్యా్గ్స్ వంటి ఇతర ప్రీమియం యాప్స్‌కి ఉచితంగా సబ్‌స్క్రైబ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది.

100% క్యాష్‌బ్యాక్ ఆఫర్ వివరాలు:
ఈ 100% క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పొందిన మై కూపన్స్‌ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో రూ.5,000 కన్నా ఎక్కువ మొత్తంపై ఏదైనా ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆ మొత్తం బిల్లుపై ఈ 100% క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ కూపన్స్‌ని రెడీమ్ చేసుకోవచ్చని జియో స్పష్టంచేసింది. నవంబర్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉండనుండగా, డిసెంబర్ 2018లోగా ఈ కూపన్స్‌ని రెడీమ్ చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ పేర్కొంది. కొత్త, పాత వినియోగదారులు అందరికీ ఈ ఆఫర్స్ వర్తించనున్నాయని సంస్థ తెలిపింది. దీపావళి అంటేనే ఎలక్ర్టానిక్స్, గృహోపకరణాలపై భారీగా అమ్మకాలు జరిగే సమయం కావడంతో 100% క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని రిలయన్స్ జియో ఇలా మార్కెటింగ్ చేసుకుంటోంది.

రూ.1,699 ప్లాన్‌ వివరాలు:
కాల పరిమితి : ఏడాది
ఇంటర్నెట్ డేటా : 1.5 GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా. ఆ తర్వాత 64Kbps వేగంతో అపరిమితమైన డేటా.
వాయిస్ కాల్స్ : అపరిమితమైన వాయిస్ కాల్స్.
ఎస్సెమ్మెస్‌లు: రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు.
జియో సినిమా, జియో టీవీ, జియో మ్యూజిక్, జియో మ్యా్గ్స్ వంటి ఇతర ప్రీమియం యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్.