RRB results 2021: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ 2021 పరీక్ష ఫలితాలు విడుదల- చెక్ చేసుకోండిలా..

RRB results 2021: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ మెదటి దశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2020 డిసెంబర్​ నుంచి 2021 జులై వరకు జరిగిన పరీక్ష ఫలితాల వివరాలు ప్రకటించింది బోర్డు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 01:42 PM IST
  • ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ 2021 ఫలితాలు విడుదల
  • సికింద్రాబాద్ రీజియన్​లో 64,693 మంది క్వాలిఫై
  • ప్రాంతీయ వెబ్​సైట్లలో అందుబాటులోకి ఫలితాలు
RRB results 2021: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ 2021 పరీక్ష ఫలితాలు విడుదల- చెక్ చేసుకోండిలా..

RRB results 2021: రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్​ (ఆర్​ఆర్​బీ) ఎన్​టీపీసీ 2021 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అన్ని రీజియన్లకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రాంతాల వారీగా అధికారిక వెబ్​సైట్లో ఈ ఫలితాల వివరాలు పొందుపరిచింది ఆర్​ఆర్​బీ. అభ్యర్థులు ఎన్​టీపీసీ మొదటి దశ కంప్యూటర్​ బెస్​డ్​ టెస్ట్​ (సీబీటీ 1)కు సబంధించి ప్రాంతీయ వెబ్​సైట్లలో ఫలితాలను చెక్​ చేసుకోవచ్చని (RRB NTPC results 2021) తెలిపింది.

2020 డిసెంబర్ 28 నుంచి 2021 జులై 31 వరకు ఈ పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో కలిపి మొత్తం 1,26,30,885 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

సికింద్రాబాద్ రీజియన్​ నుంచి 64,693 మంది, ముబయి రీజియన్​ నుంచి 73,320 మంది, అహ్మదాబాద్​ నుంచి 20,495 మంది, అజ్మేర్ రిజీయన్​ నుంచి 35,488 మంది షార్ట్​ లిస్ట్​ అయినట్లు తెలిపింది ఆర్​ఆర్​బీఐ.

సీబీటీ 1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే మెయిన్స్​ (సీబీటీ 2) పరీక్ష రాసేందుకు (RRB NTPC stage 2 exam) వీలుంది.

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..

ప్రాంతీయ ఆర్​ఆర్​బీ వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.

ఆర్​ఆర్​బీఐ ఎన్​టీపీసీ ఐడీ, పాస్​వర్డ్​ను ఉపయోగించి వెబ్​లోకి లాగ్​ఇన్ అవ్వాలి.

ఇందులో ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ 2021 రిజల్ట్స్​ పీడీఎఫ్​ రూపంలో కనిపిస్తాయి.

ఆ ఫైల్​ను డౌన్​లోడ్ చేసుకుని.. అందులో మీ రూల్​ నంబర్​ ఉందా లేదా అనే విషయాన్ని చెక్​ చేసుకోవాలి.

మీ రూల్​ నంబర్ క్వాలిఫయర్​ జాబితాలో ఉంటే.. రిజల్ట్​ను డౌన్​లోడ్​ కూడా చేసుకోవచ్చు. అలా డౌన్​లోడ్ చేసుకున్న కాపీని భద్రంగా ఉంచుకోవాలి. రెండో దశలోనూ క్వాలిఫై అయిన తర్వాత ఈ కాపీ ఉపయోగపడుతుంది.

Also read: Indian Army Day 2022: ఇవాళ ఇండియన్ ఆర్మీ డే.. 'జనవరి 15'నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా

Also read: మహారాష్ట్రలో విరుచుకుపడుతోన్న కరోనా.. 136 మంది పోలీస్ సిబ్బందికి పాజిటివ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News