Helicopter for sale: మనం సాధారణంగా కార్లు, బైక్స్ అమ్మకాలపై ఆఫర్ల గురించి వింటూ ఉంటాం. ఫెస్టివల్స్ సమయాల్లో ఆయా కంపెనీలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తూ..కస్టమర్లను ఆకట్టుకుంటాయి. కానీ హెలికాప్టర్ అమ్మకాలపై కూడా ఆఫర్ల ఉంటాయని మీకు తెలుసా?..అయితే ఏ హెలికాప్టర్ కంపెనీయో ఆఫర్ ప్రకటించిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఓ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్(Helicopter)ను అమ్మకానికి పెట్టింది. అది కూడా తక్కువ ధరకు. ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే పదండి స్టోరీలోకి వెళ్దాం.
ఓ అగస్టా హెలికాప్టర్ (Agusta Helicopter)ను రాజస్థాన్ (Rajasthan) ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. రూ.30 కోట్ల హెలికాప్టర్‌పై ఏకంగా రూ.26 కోట్లు డిస్కౌంట్(Discount) ఇస్తున్నట్లు ప్రకటించింది. కేవలం రూ.4కోట్లకే ఇస్తామని వెల్లడించింది. అయినా ఆ చాపర్‌ను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
అసలు కథ ఏంటంటే..
రాజస్థాన్(Rajasthan) ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే (Vasundhara Raje) ఉన్న సమయంలో 2005లో రాజస్థాన్ ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేసి... ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ నుంచి ట్విన్ ఇంజిన్ 109E హెలికాప్టర్‌ను కొనుగోలు చేసింది. అప్పటి నుంచీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆ చాపర్‌ను వినియోగిస్తున్నారు. సీఎంతో పాటు ఇతర వీవీఐపీలు ఏ అధికారిక కార్యక్రమాలకు వెళ్లాలన్నా అందులోనే వెళ్లేవారు. కానీ 2011 నుంచి అది హ్యాంగర్‌కే పరిమితమయింది. అప్పటి సీఎం అశోక్ గహ్లోత్ (ashok gehlot) ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వచ్చింది. పైలట్, సీఎం వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై ఓ సురక్షిత ప్రదేశంలో దానిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సీఎం ప్రాణాలను ముప్పులోకి నెట్టిన ఆ హెలికాప్టర్ ఇక ప్రయాణించడానికి సురక్షితం కాదని దానిని షెడ్డుకే పరిమితం చేశారు.
Also Read: Tamilnadu: తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ మరో వినూత్న నిర్ణయం, ప్రభుత్వ కళాశాల్లో చదివితే
జైపూర్(Jaipur)లోని స్టేట్ హ్యాంగర్‌లో పదేళ్లుగా వృథాగా పడి ఉంది. ఇప్పడు తుప్పుపట్టిన పరిస్థితిలో ఉంది. అగస్టా హెలికాప్టర్‌ను అమ్మేందుకు గతంలోనూ పలుమార్లు ప్రయత్నించారు అధికారులు. దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని తక్కువ ధరకే అమ్మకానికి పెట్టింది. కానీ దానిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాదాపు 12 సార్లు టెండర్లు పిలిచినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా మరోసారి హెలికాప్టర్ అమ్మకంపై రాజస్థాన్ ప్రభుత్వం(Rajasthan Government) దృష్టిసారించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. స్పేర్స్, టూల్స్‌తో కలిపి హెలికాప్టర్ కనీస ధరను రూ.4 కోట్లుగా నిర్ణయించారు. అనంతరం హెలికాప్టర్ వేలానికి ఏర్పాట్లు చేయాలని సివిల్ ఏవియేషన్ అధికారులను ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook