RSS Role In Freedom Struggle: భారత స్వాతంత్ర్య ఉద్యమం అనగానే భారత జాతీయ కాంగ్రెస్ గురించే చర్చ జరుగుతుంది. అదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్రపై అనేక వాదనలు మనుగడలో ఉన్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో వాళ్ల పాత్ర అసలే లేదని వాదించేవాళ్లున్నారు. అయితే, ఆ వాదనలను ఆర్ఎస్ఎస్ కొట్టి పారేస్తోంది.
స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదన్న అంశం ఆర్ఎస్ఎస్కు సంబంధించి జరిగే చర్చల్లో ప్రధానంగా వినిపిస్తుంది. అయితే, దేశమాతను దాస్య శృంఖలాలనుంచి విముక్తి చేసేందుకు జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపును మాత్రం అనుసరించిందని, స్వయంసేవకులకు అవసరమైన సూచనలను ఇచ్చిందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. ప్రత్యక్షంగా కాకున్నా.. దేశ కార్యంలో మాత్రం కాషాయ దండు పాత్రను ఎవరూ కాదనలేరని వాదిస్తున్నారు.
బ్రిటిష్ వలస పాలకులపై పోరాటమే లక్ష్యంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమ నాయకత్వ పగ్గాలను అందుకుంది. ఆ సమయంలో ఇవి రామస్వామి జస్టిస్ పార్టీ, ముస్లిం లీగ్, అంబేడ్కర్ ఐఎల్పీ వంటి సంస్థలు కాంగ్రెస్ విధాన నిర్ణయాలతో అనేక అంశాలలో విభేదించినా.. బ్రిటిష్ వ్యతిరేక పోరాట ఉద్యమ నాయకత్వాన్ని మాత్రం కాంగ్రెస్‌కే వదిలిపెట్టాయి.
ఆర్ఎస్ఎస్ మాత్రం కాంగ్రెస్ పుట్టిన 4 దశాబ్దాల తర్వాత 1925లో ఆవిర్భవించింది. అయితే, అప్పటికే చాలా పార్టీలను, వాటిలో అంతర్గత కుమ్ములాటలను పరిశీలించిన హెడ్గేవార్.. రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపలేదని స్వయంసేవకులు వాదిస్తారు. హిందూ సంఘటన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ను ప్రారంభించారని చెబుతారు. హిందూ సంఘటనతోనే సాంస్కృతిక, భౌగోళిక ఐక్యత, స్వాతంత్య్రం వంటివి సాధ్యపడతాయని డాక్టర్జీ విశ్వసించారని అంటారు.
భారత స్వాతంత్ర్య మహోద్యమంలో క్విట్ ఇండియా పోరాటం అత్యంత కీలకమైనది. ఒకరకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో ఇది తుది ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల పాత్ర ఎంతో ఉంది. అప్పటికే ఊరూ, వాడా సంఘటితమై శాఖలు నిర్వహిస్తున్న స్వయం సేవకులు క్విట్ ఇండియా ఉద్యమంలో క్షేత్రస్థాయిలో భాగస్వాములయ్యారు. అయితే, అవసరమైనంతగా ప్రచారం చేసుకోలేదంటున్నారు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు.
కాంగ్రెస్ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పోరాడింది. అయితే, ఆర్ఎస్ఎస్ పోరాడిందన్న చారిత్రక ఆధారాలు అంతగా దొరకకున్నా.. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించి కాంగ్రెస్ పలు సందర్భాల్లో ఇచ్చిన పిలుపునకు స్పందించి స్వయం సేవకులకు వాటిని అనుసరించాలన్న సూచనలు చేసిన అంశాన్ని ఆర్ఎస్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అంతేకాదు.. హెడ్గేవార్ కూడా స్వయంగా కాంగ్రెస్ కార్యకర్త అని, లోకమాన్య తిలక్ వంటి నాయకులతో కలిసి పనిచేసిన చరిత్ర ఉందంటున్నారు. విప్లవ కార్యక్రమాల్లో పాలుపంచుకొన్నందుకు 1921లో ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభ వించారని వాదిస్తున్నారు.
అప్పుడు కోర్టు విచారణలో భాగంగా భారత స్వాతంత్య్ర సంగ్రామం గురించి గట్టిగా వాదించారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ జాతీయోద్యమానికి సంబంధిన పలు కార్యక్రమాలలో హెడ్గేవార్ పాల్గొన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. 1931లో అటవీ సత్యాగ్రహంలో పాల్గొని మరోసారి హెడ్గేవార్ జైలుకు వెళ్లిన విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా, ఆయన ఉప్పు సత్యాగ్రహంలో కూడా కీలక భూమిక పోషించారని చెబుతున్నారు. ఈ ఉదాహరణలు చూస్తే.. దేశ స్వాతంత్య్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదన్న వాదన పసలేనిదని వాదిస్తున్నారు.
స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్న విషయాలను ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఆర్ఎస్ఎస్పై విమర్శలు వస్తున్నాయని ముఖ్యనేతలు వాదిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావం నుంచే స్వాతంత్య్రాన్ని ఆకాంక్షించిందని అంటున్నారు. 1929లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్య తీర్మానం ఆమోదించిన సమయంలో ఆ తీర్మానానికి స్వయంసేవకులందరూ మద్దతు ప్రకటించాలని, ప్రతి శాఖలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని హెడ్గేవార్ పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకున్న స్వయంసేవకులు 1930 జనవరి 26వ తేదీన అన్ని శాఖల్లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారని గుర్తు చేస్తున్నారు.
Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook