అలర్ట్: 1300 బ్రాంచీల IFSC కోడ్‌లను మార్చిన ఎస్‌బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో ఆరు అసోసియేట్ బ్యాంకులు, భారతీయ మహిళల బ్యాంకుల (బీఎంబీ) విలీనం ఏప్రిల్ 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది.

Last Updated : Aug 28, 2018, 02:15 PM IST
అలర్ట్: 1300 బ్రాంచీల IFSC కోడ్‌లను మార్చిన ఎస్‌బీఐ

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ దేశంలోని సుమారు 1300 బ్యాంకుల IFSC (ఇండియన్ ఫైనాన్సియల్ సిస్టం కోడ్)కోడ్‌లను  మార్చింది. అంతేకాకుండా ఈ బ్యాంకుల పేర్లు కూడా మార్చింది. ఆరు అనుబంధ బ్యాంకులు విలీనం కావడంతో ఈ కొత్త బ్రాంచీ కోడ్‌లు,  IFSCలు మార్చడం అనివార్యం అయ్యాయని తెలిపింది. బ్యాంకుల విలీనంతో దేశంలో డిపాజిట్లు, కస్టమర్ల సంఖ్య, బ్యాంకు శాఖల పరంగా నెంబర్ వన్‌గా ఉన్న ఎస్‌బీఐ.. ఆస్తుల విషయంలో ప్రపంచంలో 53వ స్థానంలో (రూ.33.45 లక్షల కోట్లు) ఉంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో ఆరు అసోసియేట్ బ్యాంకులు, భారతీయ మహిళల బ్యాంకుల (బీఎంబీ) విలీనం ఏప్రిల్ 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఎస్‌బీఐ శాఖల పరంగా, డిపాజిట్ల పరంగా పెరుగుదలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం లెక్కల ప్రకారం.. ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా 22,428 బ్రాంచీలు ఉన్నాయి.

డెబిట్ కార్డులపై ఎస్‌బీఐ అలర్ట్

డిసెంబర్‌ 31, 2018లోగా ప్రస్తుత మాగ్నెటిక్‌ స్ట్రైప్‌ ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డులను సరికొత్త ఈఎంవీ చిప్‌ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని ఖాతాదారులకు ఎస్‌బీఐ సూచించింది. ఇది సురక్షితమైన ప్రక్రియేనని, కొత్త కార్డుల జారీకి ఎటువంటి రుసుము వసూలు చేయమని ట్విట్టర్‌లో ద్వారా ఎస్‌బీఐ తెలిపింది. కొత్త చిప్‌ డెబిట్‌ కార్డు కోసం హోమ్‌ బ్రాంచికి వెళ్లి గానీ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా సంప్రదించవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది. నకిలీ ఏటీఎం కార్డులకు, అలానే ఏటీఎం మోసాలకు చెక్ పెట్టేందుకు  చిప్‌ ఆధారిత, పిన్‌ నంబర్‌ ఆధారిత డెబిట్, క్రెడిట్‌ కార్డులు మాత్రమే జారీ చేయాలంటూ బ్యాంకులను ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. !.  

Trending News