Sourabh Kirpal: గే కావడం వల్లనే న్యాయమూర్తిగా నియమించడం లేదు

Sourabh Kirpal: సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కల్గిస్తున్నాయి. ఒక గేను న్యాయమూర్తిగా నియమిస్తారనుకోవడం లేదంటూ సంచలనం రేపారు. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 17, 2022, 11:13 PM IST
Sourabh Kirpal: గే కావడం వల్లనే న్యాయమూర్తిగా నియమించడం లేదు

సుప్రీంకోర్టు కొలీజియం వర్సెస్ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమౌతోంది. సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై కొత్త ప్రశ్నలు రేపుతున్నాయి. అసలేం జరిగిందంటే..

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కల్గించాయి. తాను గే అనే కారణంతో జడ్జిగా తన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తోందని సౌరభ్ కిర్పాల్ స్పష్టం చేయడం ఒక్కసారిగా సంచలనమైంది. గే అనే కారణంతోనే 2017 నుంచి ఇప్పటివరకూ న్యాయమూర్తిగా తన నియామకాన్ని కేంద్రం నిలిపివేసిందని సౌరభ్ కిర్పాల్ తెలిపారు. 

కొలీజియం వర్సెస్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై వాదనలు చెలరేగుతున్న నేపధ్యంలో సౌరభ్ కిర్పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తప్పనిసరిగా ఒక స్వలింగ సంపర్కుడిని బెంచ్‌లో నియమిస్తుందని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పారు. గత ఐదేళ్లుగా సౌరభ్ కిర్పాల్ నియామకాన్ని కేంద్రం అలానే నిలిపి ఉంచడం విశేషం. ఫలితంగా దేశంలో తొలి గే జడ్జి నియామకం ఆలస్యమౌతోంది.

ఎందుకంటే ఇప్పటివరకూ 3 సార్లు సౌరభ్ కిర్పాల్ జడ్జిగా నియామక ప్రతిపాదనల్ని కేంద్రం నిలిపివేసింది. గత ఏడాది సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అధ్యక్షతన ఏర్పాటైన కొలీజియం కూడా సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ప్రతిపాదించినా..కేంద్రం ఆమోదించలేదు. కేంద్ర వైఖరిపై అటు సుప్రీంకోర్టు సైతం అసహనం వ్యక్తం చేసింది. కొలీజియం పదే పదే ప్రస్తావించిన పేర్లను కేంద్ర నిలిపివేయాన్ని అంగీకరించమని తెలిపింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రభుత్వం వర్సెస్ న్యాయవ్యవస్థ మద్య చర్చనీయాంశమౌతున్న కొలీజియం వ్యవస్థపై తనకు ఆందోళన ఉందన్నారు సౌరభ్ కిర్పాల్. మరి చూడాలి ఏం జరుగుతుందో. సౌరభ్ కిర్పాల్ చెప్పినట్టు గే న్యాయమూర్తి అవుతారా లేదా అనేది సందేహమే.

Also read: PM Kisan Update: పీఎం కిసాన్ 13వ విడత నిధులు.. రైతుల ఖాతాల్లోకి అప్పుడే నగదు జమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News