కర్ణాటక పోరు: స్టాక్ మార్కెట్ల జోరు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు లాభాల పరుగు తీస్తున్నాయి.

Last Updated : May 15, 2018, 11:08 AM IST
కర్ణాటక పోరు: స్టాక్ మార్కెట్ల జోరు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు పరుగు తీస్తున్నాయి. ఫ్లాట్‌‌గా మొదలైన సూచీలు మెజారిటీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో పుంజుకున్నాయి. 260 పాయింట్లకుపైగా లాభంతో సెన్సెక్స్ దూసుకెళ్తున్నది. ఎగ్జిట్ పోల్ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ వెళ్తుండటం మార్కెట్లలో ఉత్సాహం నింపింది.

కొద్దిసేపటి క్రితం ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్సీ 350 పాయింట్ల లాభంతో 35, 928 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా అదే బాటలో 70కి పైగా పాయింట్ల లాభంతో 10, 9195 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.67.57గా ఉంది.

 

బీజేపీ శ్రేణుల్లో సంబరాలు

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నందున దేశ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత లీడ్స్‌ ప్రకారం బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకుంది. కర్ణాటకలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.

Trending News