Gangster Jitendra Gogi killed: ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం... గ్యాంగ్‌స్టర్‌ హతం

Shootout at Delhis Rohini Court : దిల్లీలో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న జితేందర్‌ గోగి తిహార్‌ జైల్లో శిక్ష అనుభవించేవాడు. ఓ కేసు విచారణలో భాగంగా శుక్రవారం జితేందర్‌ గోగిని రోహిణిలోని కోర్టుకు తరలించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2021, 04:28 PM IST
  • దిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో కాల్పులు
  • అక్కడికక్కడే చనిపోయిన గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌
  • పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు దుండగులు హతం
Gangster Jitendra Gogi killed: ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం... గ్యాంగ్‌స్టర్‌ హతం

Shootout at Delhis Rohini Court Gangster dead gunmen posing as lawyers also killed: దేశ రాజధాని దిల్లీ పట్టపగలే కాల్పులతో దద్దరిల్లింది. దిల్లీలోని రోహిణి కోర్టు (Rohini Court) ఆవరణలో ఓ గ్యాంగ్‌స్టర్‌ లక్ష్యంగా ప్రత్యర్థి గ్యాంగ్‌ కాల్పులు చేపట్టింది. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ (Gangster Jitendra) అక్కడికక్కడే చనిపోయారు. అయితే అదే సమయంలో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు దుండగులు కూడా హతమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి.

లాయర్ల వేషధారణలో..

దిల్లీలో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న జితేందర్‌ గోగి (Gangster Jitendra Gogi) తిహార్‌ జైల్లో (tihar jail) శిక్ష అనుభవించేవాడు. ఓ కేసు విచారణలో భాగంగా శుక్రవారం జితేందర్‌ గోగిని రోహిణిలోని కోర్టుకు తరలించారు. అదే సమయంలో లాయర్ల వేషధారణలో వచ్చిన ముగ్గురు ప్రత్యర్థి గ్యాంగ్‌ సభ్యులు కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగిపై కాల్పులు జరిపారు. ముగ్గురు దుండగులు దాదాపు 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో జితేందర్‌ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

 

Also Read: Vijay Deverakonda theatre: తల్లి కోసం విజయ్‌ దేవరకొండ సొంత థియేటర్‌, లవ్‌స్టోరీ మూవీ ప్రదర్శన

జితేందర్‌గోగిపై చాలా క్రిమినల్‌ కేసులు

అయితే వెంటనే దిల్లీ స్పెషల్‌సెల్‌ పోలీసులు (delhi special cell  police).. దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు దుండగులు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు పాల్పడిన దుండగులంతా టిల్లు తాజ్‌ పూరియా గ్యాంగ్‌ సభ్యులుగా అనుమానిస్తున్నట్లు రోహిణి డీసీపీ ప్రణవ్‌ తయాల్‌ తెలిపారు. గ్యాంగ్‌స్టర్‌ (gangster) జితేందర్‌గోగిపై చాలా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

రూ.5కోట్లు ఇవ్వాలని జితేందర్‌గోగి బ్లాక్‌మెయిల్‌

అయితే ఈ మధ్య ఓ వ్యాపారవేత్తను రూ.5కోట్లు ఇవ్వాలని జితేందర్‌గోగి బ్లాక్‌మెయిల్‌ (Blackmail) చేయడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో భాగంగా జితేందర్‌ను దిల్లీ (Delhi)స్పెషల్‌సెల్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి తిహార్‌ జైల్లో పెట్టారు. విచారణలో భాగంగా జితేందర్‌ గోగిని రోహిణి కోర్టుకు తీసుకురాగా ఈ దాడి జరిగింది.

Also Read : IPL 2021: కేకేఆర్‌కు భారీ షాక్..కెప్టెన్ మెర్గాన్ కు రూ.24 లక్షల జరిమానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News