హింసాత్మకంగా మారిన ఆందోళన.. ఆరు బస్సులకు నిప్పు

ఆరు బస్సులకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు  

Last Updated : Jul 30, 2018, 05:30 PM IST
హింసాత్మకంగా మారిన ఆందోళన.. ఆరు బస్సులకు నిప్పు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా కోరుతూ మరాఠాలు చేపట్టిన ఆందోళన రాన్రాను మరింత హింసాత్మకమవుతోంది. సోమవారం పూణె శివార్లలోని పూణె-నాసిక్ జాతీయ రహదారిపై ఉన్న చకాన్ పారిశ్రామిక వాడలో ఆందోళనకారులు ఆరు బస్సులకు నిప్పుపెట్టారు. ఈ హింసాత్మక ఘటనల వెనుక ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మరాఠా క్రాంతి మోర్చ ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చకాన్ పారిశ్రామిక వాడలో ఆందోళనలు హింసాత్మకమవడంతో పూణె-నాసిక్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో చకాన్‌లో పోలీసులు ఐపీసీ 144 సెక్షన్ విధించారు. 

ఆరు బస్సులకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

ఇవాళే చార్జ్ తీసుకున్న స్థానిక ఎస్పీ సందీప్ పాటిల్ నేతృత్వంలో అక్కడకు చేరుకున్న అదనపు పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాయి. మహారాష్ట్రలో విద్య, ఉపాధి అవకాశాల్లో స్థానికులకే అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తూ పలు ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ఆందోళన పలు చోట్ల హింసాత్మకంగా మారింది. 

Trending News